Begin typing your search above and press return to search.

కాలుష్యం చేయొద్దు..ఒక్కో రైతుకు డబ్బులు!

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:40 AM GMT
కాలుష్యం చేయొద్దు..ఒక్కో రైతుకు డబ్బులు!
X
ఢిల్లీ లో తీవ్ర స్థాయి కి చేరిన కాలుష్యానికి కారణం.. పంజాబ్, హర్యానాల కు చెందిన రైతు లే అనే విశ్లేషణ గట్టిగా వినిపిస్తూ ఉంది. ప్రతి యేటా పంటలు చేతికందాకా, పంట వ్యర్థాల ను అక్కడి రైతులు పొలాల్లోనే తగులబెడతారు. దీంతో పెద్ద ఎత్తున పొగ వస్తుంది.

అలాంటి విషపూరిత ధూళి అంతా మేఘాలుగా మారి.. ఢిల్లీ వైపు సాగుతూ ఉందని నిపుణులు తేల్చారు. ఇదే సమయం లో శీతాకాలం కావడం తో గాలి వేగం తగ్గి పోతుంది. వాతావరణం మందకొడి గా మారుతుంది. అప్పటికే వాహనాలు విడుదల చేసే కాలుష్యం ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది.

ఇలాంటి తరుణం లో పంట వ్యర్థాల పొగ ఢిల్లీలో జీవనాన్ని చాలా దారుణంగా మారుస్తుంది. అయితే కొంతమంది రైతుల ను వెనకేసుకు వస్తూ ఉన్నారు. ఢిల్లీ కాలుష్యానికి వారు కారణం కాదని అంటున్నారు.

అయితే తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఒక ఆసక్తి దాయకమైన నిర్ణయాన్ని తీసుకుంది. పంట పొలాల్లో పంట వ్యర్థాలను తగుల బెట్టని వాళ్ల కు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది.

చిన్నా సన్నకారు రైతులు పంట వ్యర్థాలను తగల బెట్టకపోతే వారికి ఎకరాకు రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం ఓకే చెప్పింది. కాలుష్యానికి కారకం కాని రైతులకు ఈ డబ్బుల ను డైరెక్టు గా ఖాతాల్లోకి వేయడానికి పంజాబ్ ప్రభుత్వం సమ్మతించింది. ఢిల్లీ కాలుష్యాన్ని అరి కట్టేందుకు పంజాబ్ గవర్నమెంట్ ఈ మేరకు చర్యలు చేపట్టడం అభినందనీయమే.