Begin typing your search above and press return to search.

100లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల విలీనం వద్దు

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:01 PM IST
100లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల విలీనం వద్దు
X
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఖాళీగా సర్కార్ పాఠశాలలు బోసిపోతున్నాయి. విద్యార్థులు లేని స్కూళ్లను ఎత్తివేసి పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల విలీనంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలల విలీనంపై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో నుంచి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులను విలీనం చేయవద్దని విద్యాశాఖ నిర్ణయించింది.

ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలో కలపాలని.. గిరిజన సంక్షేమ పాఠశాలలను అసలు విలీనం చేయవద్దని తెలిపింది. 20మంది కన్నా తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేయరు.

అలాగే హైస్కూల్ స్థాయిలో 1000 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాటిల్లోనూ 3,4,5 తరగతులను కలపవద్దని విద్యాశాఖ నిర్ణయించింది.

కాగా ఎయిడెడ్ పాఠశాల విలీనంపై ఏపీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులును విద్యార్థులకు అందజేస్తే విలీనం అవసరం లేదని ప్రకటించింది.