Begin typing your search above and press return to search.
చీరతో వస్తే ఈ హోటల్ లోకి నో ప్రవేశం
By: Tupaki Desk | 16 March 2020 11:00 PM ISTచీర.. భారతీయ సంప్రదాయానికి ప్రతీక. ఈ జీన్స్ ప్యాంట్స్ సహా అన్ని ఇతర దేశాలు, ప్రాంతాల నుంచివచ్చినవే. కానీ భారతీయత ఉట్టిపడే చీర కట్టుకొని వచ్చిన మహిళను దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఓ హై-క్లాస్ రెస్టారెంట్ లోపలికి అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. భారతదేశంలోనే ఇలాంటి దారుణ అవమానం జరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీకి దగ్గరలోని గురుగ్రామ్‌లో ప్రఖ్యాత పాఠశాలలో ప్రిన్సిపాల్ గా సంగీత నాగ్ అనే మహిళ పనిచేస్తోంది. ఈమె చీరలో ఢిల్లీలోని కైలిన్ఐవీ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే సిబ్బంది ఆమెను గేట్ల వద్ద ఆపి, ఆమె చీర కట్టుకొని రెస్టారెంట్ లోకి రావద్దని.. ఆధునిక దుస్తులు ధరించే రావాలని.. ఇలా వస్తే అనుమతి లేదని లోపలికి అనుమతించలేదు.
ఈ హఠాత్ పరిణామానికి షాకైన సంగీత మొత్తం ఎపిసోడ్‌ను చిత్రీకరించి వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఆమె దీనిపై బాధను వ్యక్తం చేస్తూ ఒక వ్యాఖ్యను కూడా జోడించింది. ‘ఈ సాయంత్రం కైలిన్ ఐవీ, రెస్టారెంట్ వద్ద నాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మన సంస్కృతి అయిన చీరతో వెళ్లితే ఈ దస్తులు ధరించడం వల్ల తనను హోటల్ లోకి అనుమతించలేదు. ఇది భారతదేశంలోని రెస్టారెంట్లోనే ఇలా జరిగింది’ అని.. భారతీయులు భారతీయ దుస్తులు ధరించడం తప్పా.. భారతీయుడిగా గర్వించటానికి వీలులేదా అని వాపోయింది.
ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. చీర ధరించిన మహిళను అవమానించిన రెస్టారెంట్‌ను నెటిజన్లు తూర్పారపట్టారు. అందరిలోనూ రెస్టారెంట్ నిర్వాకంపై ఆగ్రహం పెల్లుబుకింది. హోటల్ యాజమాన్యం ఈ వివాదాన్ని గ్రహించి త్వరగా ప్రిన్సిపాల్ సంగీతకు క్షమాపణలు చెప్పింది. తాత్కాలిక సిబ్బంది చేసిన పొరపాటు ఇది అని, అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు.
క్షమాపణ చెప్పిన తరువాత సంగీత స్పందించింది. మేనేజ్‌మెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్‌లో పేర్కొంది. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పనందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొంది.