Begin typing your search above and press return to search.

ఏపీలో ఎంపీలు కనపడుట లేదా?

By:  Tupaki Desk   |   18 Aug 2020 12:01 PM IST
ఏపీలో ఎంపీలు కనపడుట లేదా?
X
ఏపీలో ఎక్కడ చూసినా సీఎం జగన్ మాత్రమే కనిపిస్తున్నాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెనుక అటూ ఇటూ అప్పుడప్పుడూ తచ్చాడుతున్నారట. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం అంత ఈజీగా కనిపించడం లేదట.. ఇప్పుడిదే చర్చ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ గా సాగుతోంది.

ఏపీలో వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలున్నారు. టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. కానీ టీడీపీ ఎంపీలు అటు పార్లమెంట్ లో ఇటూ బయట ఉనికి చాటుకుంటున్నారు. ట్విట్టర్ లో కనపడుతున్నారు. వైసీపీలో 22 మంది ఎంపీల్లో కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే అప్పుడప్పుడు మెరుపు తీగ మాదిరి కనిపించి కనిపించని చందంగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.

అసలు నియోజకవర్గాల్లో ఎంపీల పేర్లే దాదాపు 90శాతం తెలియడం లేదని ఓ టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఎంపీలను ఎమ్మెల్యేలను వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదంట.. పిలవని పేరంటానికి పోవడం మనకెందుకులే అని వాళ్లు కూడా ఊరుకుంటున్నారు..

అసలు ఎంపీ లాండ్స్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఏదో చిన్న అభివృద్ధి చేయవచ్చు కదా అంటే.. మమ్మలను ఎమ్మెల్యేలు రానీయడం లేదు అని ఎంపీలు వాపోతున్నారట.. ఇప్పుడు ఇదే వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందట..