Begin typing your search above and press return to search.
మోడీకి పోటు.. జేఎన్యూకు ఈ హీరో తోడు
By: Tupaki Desk | 12 Jan 2020 3:53 PM ISTఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులపై హిందుత్వ వాదులు దాడి చేసి గాయపరచడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.. ఈ దాడికి నిరసనగా జేఎన్యూలో గాయపడ్డ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో పలువురు సినీ - రాజకీయ ప్రముఖులు వీరికి మద్దతుగా నిలిచి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
తాజాగా జేఎన్యూ విద్యార్థులకు ప్రముఖ తమిళ నటుడు - డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి మద్దతు పలికారు. విద్యార్థులతో కలిసి తానూ దీక్ష శిభిరంలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి మాట్లాడారు.
ఉదయనిధి ప్రస్తుతం సినిమాలు చేస్తూనే తండ్రికి చేదోడుగా డీఎంకే యువజన విభాగం బాధ్యతలు చూస్తున్నారు. రాజకీయాలు వంటపట్టించుకొని యువనేతగా ఎదుగుతున్నారు.
తాజాగా జేఎన్యూలో పర్యటించారు. దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉదయనిధి పోలీసులను ప్రశ్నించారు. ఏబీవీపీ నేతలే ఈ దాడి చేసి ఉండొచ్చని ఆరోపించారు. కేంద్రం దాడి చేసిన వారిని కాపాడుతోందని మండిపడ్డారు.