Begin typing your search above and press return to search.

కమలా హ్యారిస్ కు స్టాలిన్ లేఖ..

By:  Tupaki Desk   |   10 Nov 2020 9:00 AM IST
కమలా హ్యారిస్ కు స్టాలిన్ లేఖ..
X
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలాహారిస్ తమిళ బిడ్డ కావడంతో ఆ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. తమిళ పార్టీలు, ప్రజలు కమలాహారిస్ ను ఓన్ చేసుకొని శుభాకాంక్షలు చెబుతున్నారు. కమలా ఫొటోలు, ఫ్లెక్సీలు పెట్టి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ మూలాలున్న కమలా అమెరికాలో అత్యున్నత పదవిని చేపట్టడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కమలా హారిస్ కు ఒక లేఖ రాశారు. ఆమె గెలుపు ద్రవిడ ఉద్యమానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. ‘వణక్కం.. కమలా అమెరికా ఉపాధ్యక్షురాలు కావడం.. తమిళ ప్రజలందరికీ గర్వకారణం.. ద్రవిడ ఉద్యమ రాజకీయ సిద్ధాంతాలకు మీ గెలుపు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీ మాతృమూర్తి శ్యామలా గోపాలన్ హ్యారిస్ మాతృభాష అయిన తమిళంలో ఈ లేఖ రాయడం నాకు సంతోషాన్ని ఇస్తోంది. ’ అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

ద్రవిడ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా అమెరికా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా కమలా పనిచేస్తారని ఆశిస్తున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు. అమెరికాను పాలించగల సమర్థత తమిళ మహిళకు ఉందని ఆమె నిరూపించారన్నారు.

కాగా కమలాహారిస్ పూర్వీకుల మూలాలు తమిళనాడులోని పైంగనాడులో ఉన్న తులసెంథిరపురంలో ఉన్నాయి. కమలా తల్లి శ్యామల సొంతూరు ఇదే. ఆమె గెలుపుతో ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కమలా తల్లి 1960లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆమె బయో మెడికల్ సైంటిస్ట్. జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ అనే ఎకనామిస్ట్ ను వివాహం చేసుకున్నారు. శ్యామలా-డొనాల్డ్ దంపతులకు కమలా హారిస్,మాయా హారిస్ ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలైంది.