Begin typing your search above and press return to search.

బీజేపీ, కాంగ్రెస్ లను కలిపిన అరుదైన పెళ్లి

By:  Tupaki Desk   |   15 Jun 2020 12:50 PM GMT
బీజేపీ, కాంగ్రెస్ లను కలిపిన అరుదైన పెళ్లి
X
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు , ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి చూపులు ఘనంగా జరిగాయి. దాదాపు రూ.1000 కోట్ల ఆస్తిపరురాలు అయిన ఆమె బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మనవడు అమాథ్యను పెళ్లి చేసుకోబోతున్నారు.

ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవిక, కాఫిడే కింగ్ వీజీ సిద్ధార్థ కుమారుడే ఈ అమాథ్య. తండ్రి స్థాపించిన కాఫిడే సంస్థలను చూసుకుంటున్నారు.

ఈ పెళ్లి కర్ణాటకలో అస్సలు పడని బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య చోటుచేసుకుంటుండడం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కన్నడ మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ బీజేపీలో ఉండగా.. డీకే శివకుమార్ కన్నడ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు. ఇలా బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య బంధుత్వం ఆసక్తి రేపుతోంది.

బెంగళూరులోని సదాశివనగర్ లోని మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇంటికి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుటుంబ సభ్యులు స్వయంగా వెళ్లారు. వీరిని ఎస్ఎం కృష్ణ ఆహ్వానించారు. తాంబూలాలు మార్చుకొన్నారు. ఇలా బీజేపీ-కాంగ్రెస్ దిగ్గజ నేతల కుటుంబాలు ఈ పెళ్లితో ఒక్కటి కాబోతున్నాయి.