Begin typing your search above and press return to search.

ఏకంగా టీఆర్ ఎస్ నే టార్గెట్ చేసింది..

By:  Tupaki Desk   |   19 July 2019 10:05 AM IST
ఏకంగా టీఆర్ ఎస్ నే టార్గెట్ చేసింది..
X
టీఆర్ ఎస్ అంటే కోపం, కసి, పగ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ సహా టీఆర్ ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నారు డీకే అరుణ. కానీ అదే టీఆర్ ఎస్ చేతిలో ఓడిపోయారు. కుదేలైన కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదనుకొని పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి అదే టీఆర్ ఎస్ చేతిలో మళ్లీ ఓడిపోయారు.

డీకే అరుణ వరుస ఓటములతో ఆమె ఫుల్ ఆశలు పెంచుకున్న బీజేపీ ఈమెను లైట్ తీసుకుంటోందన్న ప్రచారం సాగుతోంది. అందుకే ఇప్పుడు తన పరపతి, చాణక్యం అంతా రంగరించి టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఆమె రెడీ అయ్యారన్న ప్రచారం సాగుతోంది.

టీఆర్ ఎస్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మహబూబ్ నగర్ లో ఈ ఎన్నికల్లోనే టీఆర్ ఎస్ కు షాకిచ్చేందుకు బీజేపీ రెడీ అయ్యిందట.. గతంలో మంత్రిగా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వల్లే ఓడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రిని ఆకర్షించేందుకు డీకే అరుణ పెద్ద స్కెచ్ గీశారట.. అంతేకాదు.. టీఆర్ఎస్ లో టికెట్లు దక్కని నేతలను లాగేసి బీజేపీపై పోటీచేయించి గులాబీ దళానికి షాకిచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేశారట..

ఓవర్ ఫ్లో అయిన టీఆర్ ఎస్ నుంచి ఇప్పుడు అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి.. పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పేందుకు డీకే అరుణ సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మరీ గులాబీ అధిష్టానం డీకే అరుణ ప్లాన్లకు ఎలాంటి విరుగుడు కనిపెడుతుందో చూడాలి మరీ..