Begin typing your search above and press return to search.

ఆ దేశంలో 90 శాతం పెళ్లిళ్లు పెటాకులే.. దేశాల్లో విడాకుల రేట్లు ఇవీ

By:  Tupaki Desk   |   2 May 2023 8:18 PM GMT
ఆ దేశంలో 90 శాతం పెళ్లిళ్లు పెటాకులే.. దేశాల్లో విడాకుల రేట్లు ఇవీ
X
పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ అందరికీ అది నూరేళ్ల మంటగా మారింది. విభిన్న యువతీ యువకులు కలువలేకపోతున్నారు. మెజార్టీ జంటలు పెళ్లైన కొద్దిరోజులకే విడిపోతున్నారు. నాగచైతన్య- సమంత నుంచి సామాన్య జంటల వరకూ ఇదే కథ. మన దేశంలో విడాకుల కేసులను చూసి జంటలను విడిపోవడాలు చూసి మన దగ్గరనే ఎక్కువ అని అనుకుంటాం. కానీ కానే కాదు. విడాకులు ఎక్కువగా తీసుకుంటున్న దేశాల జాబితాలో మన భారత్ దేశం చిట్టచివరన ఉంది. మన దగ్గర విడాకులు ఎక్కువగా జరుగుతున్నా ఇతర దేశాలతో పోలిస్తే అది చాలా తక్కువ. ఈ గణాంకాలే తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక విడాకుల రేటు ‘పోర్చుగల్ దేశంలో’ ఉంది. ఇక్కడ విడాకులు తీసుకునే జంటలు వందకు ఏకంగా 94 శాతం ఉండడంతో అక్కడ పెళ్లి అయిన వారు అందరూ విడాకులు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది.

-దేశాలలో విడాకుల రేట్లు ఏమిటి?

ఇటీవల విడాకుల ప్రక్రియపై భారత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక పరిస్థితులలో విడాకులు మంజూరు చేయడానికి తప్పనిసరి ఆరు నెలల విధానాన్ని తొలగించవచ్చని.. దీని కోసం సుప్రీంకోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించవచ్చని పేర్కొంది. అప్పటి నుంచి ఉత్తర్వులపై చర్చ నడుస్తోంది.

ఈ మధ్య ఒక ప్రముఖ సంస్థ వివిధ దేశాల్లో విడాకులు తీసుకుంటున్న రేట్లను ప్రకటించింది. భారతదేశంలో విడాకుల రేటు కేవలం ఒక శాతం మాత్రమేనని తెలిపింది. స్పెయిన్ , పోర్చుగల్ వరుసగా 85 , 94 శాతంతో అత్యధిక విడాకుల రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండూ పక్కపక్క దేశాలే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల నుంచి డేటాను సేకరించిన తర్వాత ఈ నివేదికను దాఖలు చేశారు.

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెబ్‌సైట్ అనేక దేశాలలో విడాకుల రేట్లపై డేటా షేర్ చేసింది. ఈ డేటా ఒక సంవత్సరానికి పేర్కొనబడింది. ఈ డేటా కొంచెం అటూ ఇటూ మారవచ్చు. పోర్చుగల్‌లో విడాకుల రేటు 91 శాతం ఉంది. సంబంధిత సంవత్సరానికి మాత్రమే ఈ రేటు చూడాలి. మొత్తం విడాకుల రేటుగా దీన్ని చూడకూడదు.

భారీ జనాభా ఉన్నప్పటికీ భారతదేశంలో తక్కువ శాతం ఎలా ఇంత తక్కువ విడాకుల శాతం ఉందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ డేటా కేవలం 2022 సంవత్సరానికి పరిమితం చేయబడింది. మొత్తం రేటు కాదు. సంబంధిత దేశాలలో జరిగిన వివాహాలు , వాటిలో ఎన్ని వివాహాలు విడాకులుగా ముగిశాయి అనే దానిపై డేటా ఆధారపడి ఉంటుంది.

కానీ విషయం ఏమిటంటే ఒక సంవత్సరంలో కొన్ని వివాహాలు జరిగినప్పటికీ చాలా దేశాలు అధిక విడాకుల రేటును నమోదు చేశాయి. మరోవైపు, విడాకుల రేటులో భారతదేశం కేవలం ఒక శాతం మాత్రమే నివేదించింది. సామాజిక నియమాలు, కుటుంబ నిబంధనలు ఇక్కడ విడాకులను తగ్గించాయనే చెప్పొచ్చు. ఒక జంట విడాకుల కోసం వెళ్లాలనుకున్నప్పుడు, వారి కుటుంబాలు వారిని ఆపడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తాయి. పాశ్చాత్య దేశాలలో ఇలా ఆపేవారు లేరు. చిన్న కుటుంబాలు, స్వతంత్రతో అక్కడ విడాకులు ఎక్కువగా నమోదవుతున్నాయి.


-వివిధ దేశాల్లో విడాకుల రేటు:

భారతదేశం: 1%

వియత్నాం: 7%

తజికిస్తాన్: 10%

ఇరాన్: 14%

మెక్సికో: 17%

ఈజిప్ట్: 17%

దక్షిణాఫ్రికా: 17%

బ్రెజిల్: 21%

టర్కీ: 25%

కొలంబియా: 30%

పోలాండ్: 33%

జపాన్: 35%

జర్మనీ: 38%

యునైటెడ్ కింగ్‌డమ్: 41%

న్యూజిలాండ్: 41%

ఆస్ట్రేలియా: 43%

చైనా: 44%

యునైటెడ్ స్టేట్స్: 45%

దక్షిణ కొరియా: 46%

డెన్మార్క్: 46%

ఇటలీ: 46%

కెనడా: 47%

నెదర్లాండ్స్: 48%

స్వీడన్: 50%

ఫ్రాన్స్: 51%

బెల్జియం: 53%

ఫిన్లాండ్: 55%

క్యూబా: 55%

ఉక్రెయిన్: 70%

రష్యా: 73%

లక్సెంబర్గ్: 79%

స్పెయిన్: 85%

పోర్చుగల్: 94%