Begin typing your search above and press return to search.
డైవర్స్ కు డిమాండ్ లేని కంట్రీ!
By: Tupaki Desk | 14 April 2016 5:30 PM GMTప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో విడాకుల శాతం బాగా తక్కువట. జనన మరణాలు - శిశుమరణాలు - వివాహాలు వంటివాటిలో ప్రపంచ దేశాలతో పోల్చితే మన దగ్గర ఎక్కువే అయినా, విడాకుల రేటు విషయంలో మాత్రం ప్రపంచ దేశాలతో పోల్చితే మన దగ్గర తక్కువే. అమెరికాలో 50 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతుంటే ఇండియాలో అది కేవలం 1.1 శాతం మాత్రమే.
అయితే... ప్రస్తుతం 1.1 శాతంగా ఉన్నప్పటికీ గతం కంటే ఇది బాగా ఎక్కువ. దేశంలో నగరాలు - పల్లెలు - ఉన్నత వర్గాలు - నిమ్న వర్గాలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల్లో విడాకుల శాతం పెరిగిపోతోందట.
ఢిల్లీని ఉదాహరణగా తీసుకుంటే...
- 1960లో ఢిల్లీలో ఏడాదికి 1 నుంచి 2 విడాకుల కేసులు ఉండేవట.
- 1980ల్లో ఏడాదికి 100 నుంచి 200 కేసులు నమోదయ్యేవట.
- 1990లో సుమారు వెయ్యి కేసులు ఏడాదికి నమోదయ్యేవి.
- ఇక ఈ దశాబ్దానికి వస్తే.. 2000 సంవత్సరం తరువాత ఏడాదికి 9 వేల నుంచి 10 వేల విడాకుల కేసులు ఢిల్లీలో నమోదవుతున్నాయి.
ముంబయిలో ఇలా..
- 2007లో ముంబయిలో 7000 కేసులు నమోదయ్యాయి.
- అంతకుముందు ఏడాది కంటే 60 శాతం ఎక్కువ అది. దాన్ని బట్టి విడాకుల తీసుకునేవారి సంఖ్య ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. విడాకుల కోసం కోర్టుకెళ్తున్నవారిలో 70 శాతం మంది 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే.
మిగతా పట్టణాలు - నగరాల్లోనూ విడాకుల కోసం కోర్టుకెళ్లేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ కలిసి గడిపే సమయం లేకపోవడం... అపార్థాలు - ఇతర సంబంధాలు వంటి కారణాలతో పాటు విడాకులు తీసుకోవడాన్ని చాలా సాధారణంగానే భావించే మనస్తత్వం పెరగడం కూడా ఈ ధోరణి ఎక్కువ కావడానికి కారణంగా చెప్పొచ్చు.
అయితే సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా వివాహ వ్యవస్థను నమ్మేవారు ఉండడం.. మనుషుల మధ్య ప్రేమానుబంధాలకు విలువ ఇవ్వడం వల్ల చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకుపోతుంటారు. ఈ కారణంగానే మిగతా దేశాలతో పోల్చితే విడాకుల శాతం మన దగ్గర తక్కువే.