Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో అపర కుబేరుడు ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 30 Sep 2020 7:30 AM GMTప్రతి ఏటా అత్యంత సంపన్నులు.. వారి కుటుంబాలకు సంబంధించిన ఒక జాబితాను వెల్లడిస్తుంటుంది హురున్ రిచ్ లిస్టు. తాజాగా 2020 సంవత్సరానికి ఈ సంస్థ తాజా జాబితాను విడుదల చేసింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడిగా దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీ దివీ..ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది.తాజాగా లెక్కల ప్రకారం ఆయన.. ఆయన కుటుంబ ఆస్తి విలువ ఏకంగా రూ.49,200 కోట్లుగా తేల్చారు. అత్యంత సంపన్నమైన వారిలో ఎక్కువమంది ఫార్మా.. రియల్ ఎస్టేట్ కు చెందిన వారు ఉండటం గమనార్హం.
తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాలకుచెందిన 62 మందికి చోటు లభించింది. ఈ జాబితాలోకి వెయ్యి కోట్లకు పైనే ఆస్తిపరుల్ని లెక్కలోకి తీసుకున్నారు. ఈ ఏడాది జాబితాలో కొత్తగా పది మంది చోటు దక్కించుకున్నారు. జాబితాలో స్థానం దక్కించుకున్న 62 మంది సంపన్నుల ఆస్తి మొత్తాన్ని లెక్కిస్తే అది రూ.2.45 లక్షల కోట్లుగా తేలింది. దేశ వ్యాప్తంగా ఏడాది వ్యవధిలో అత్యధికంగా ఆస్తి వృద్ధి చెందిన ఐదుగురిలో ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
ఏడాదిలో భారీగా ఆస్తి వృద్ధి చెందిన వారిలో గ్రాన్యూల్స్ ఇండియా ఛైర్మన్ చిగురుపాటి కృష్ణప్రసాద్ ఒకరు. ఏడాదిలో ఆయన ఆస్తి 218 శాతం పెరిగింది. భారీగా ఆస్తి పెరిగిన రెండో సంపన్నుడు లారస్ ల్యాబ్స్ అధినేత సీ సత్యనారాయణగా తేల్చారు. ఏడాదిలో ఆయన ఆస్తి 210 శాతం పెరిగటం గమనార్హం. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ మహిమ దాట్ల కావటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా గుర్తింపు పొందిన62 మందిలో అత్యధికంగా ఫార్మాస్యూటిక్స్ కు చెందిన వారు 20 మంది ఉంటే.. ఫుడ్ ప్రాసెసింగ్ కు చెందినవారు ఏడుగురు.. నిర్మాణం.. ఇంజనీరింగ్ లో ఐదుగురు.. క్యాపిటల్ గూడ్స్ లో నలుగురు.. ఫుడ్ అండ్ బెవరేజెస్ లో నలుగురు ఉన్నారు.