Begin typing your search above and press return to search.
ఈ రోజు నుండే ఇళ్ల పట్టాల పంపిణీ...
By: Tupaki Desk | 25 Dec 2020 5:40 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించనుంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. కోర్టు వివాదలు ఉన్న ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది.ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు..15 లక్షలకుపైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం.
సీఎం జగన్ కడప నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుని పైలాన్ ను ఆవిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, భూమి పూజలు కొనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్రలో మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైఎస్ జగన్.. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది ఉగాది పండగ రోజున ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే విపక్షం దీనిపై కోర్టుకు వెళ్లడంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని తలిచింది. అదికూడా వాయిదా పడడంతో… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న పట్టాలు పంపిణీకి సిద్ధమయ్యింది. కోర్టు కేసులతో మరోసారి వాయిదా పడడంతో… వైఎస్ జయంతి రోజైన జులై 8, ఆ తర్వాత పంద్రాగస్టు, చివరికి గాంధీ జయంతిని కూడా ముహూర్తంగా నిర్ణయించారు. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు ఈ రోజు నిర్వహిస్తోంది.
రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. వాస్తవాలను కోర్టులకు నివేదించడం ద్వారా స్టేలను ఎత్తివేయించి మిగిలిన 3.51 లక్షల మందికి కూడా త్వరలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఒక సెంటు స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. 23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని… నిరుపేదలకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ భూమి 25, 120.33 ఎకరాలు ఉండగా.. 25,359.31 ఎకరాల భూమిని 10వేల 150 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ రోజు సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం 15 రోజుల పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.