Begin typing your search above and press return to search.

ఆ సంస్థలకి 2 లక్షల డోసుల పంపిణీ..భారత్ కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   18 Feb 2021 7:30 AM GMT
ఆ సంస్థలకి 2 లక్షల డోసుల పంపిణీ..భారత్ కీలక నిర్ణయం!
X
భారత ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్లు బహుమతిగా ఇవ్వాలనిఆలోచిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఎవిఐ తదితర అంతర్జాతీయ సంస్థల్లో చురుగ్గా ఉంటోన్న భారత్ శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని డిసిషన్ తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఓపెన్ డిబేట్‌ సందర్భంగా జై శంకర్ ఈ ప్రకటన చేశారు.

సార్క్ కరోనా ఎమర్సెన్సీ ఫండ్‌ కోసం భారత్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు భారతదేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు అందజేసిందని చెప్పారు. మరో 49 దేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. భారత ప్రభుత్వం తాజా నిర్ణయం పట్ల డబ్ల్యుహెచ్‌వో, జీఎవీఐ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని తమ ఉదారతను చాటాయని ప్రశంసలతో ముంచెత్తాయి. ఇటు దేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ అందజేత కార్యక్రమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

ప్రపంచ అవసరాలను తీర్చడానికి ఫార్మసీ రంగం మొత్తం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో భారత్ పొరుగు దేశాలకు కరోనా వ్యాక్సిన్ ‌ను అందిస్తూ తోడ్పాటునందిస్తుందని జైశంకర్ వివరించారు. భారత్ ‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని.. వచ్చే ఆరు నెలల్లో 300 మిలియన్ల టీకాలు వేయనున్నట్లు జై శంకర్ తెలిపారు.