Begin typing your search above and press return to search.
బొబ్బిలి కోటలో వైసీపీకి అసమ్మతి సెగ
By: Tupaki Desk | 13 Feb 2023 1:26 PM GMTవిజయనగరం జిల్లా బొబ్బిలిలో వైసీపీ 2019 ఎన్నికల్లో ఏకంగా మంత్రిని సైతం ఓడించి ఘన విజయం సాధించింది. బొబ్బిలిలో అప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన తెలుగుదేశం మంత్రి సుజయ క్రిష్ణ రంగారావుని వైసీపీ నుంచి పోటీ చేసిన శంబంగి చిన అప్పలనాయుడు ఓడించారు. మంత్రిగా ఉంటూ ఓటమి పాలు కావడంతో సుజయ క్రిష్ణ రంగారావు వేదన చెందారు. అప్పటికి రాజకీయంగా తెరమరుగు అయిన శంబంగి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అలా మొదలెట్టారు.
అయితే శంబంగి గత నాలుగేళ్ల ఎమ్మెల్యే గిరిలో సొంత పార్టీ వారి మెప్పునే పొందలేకపోతున్నారు అని అంటున్నారు. బొబ్బిలిలో చూస్తే లోకల్ బాడీ ఎన్నికల నాటికే టీడీపీ గ్రాఫ్ పుంజుకుంది. మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన పట్టుదలగా టీడీపీని నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ అని అధినాయకత్వం స్పష్టం చేయడంతో ఆయన దూకుడు చేస్తున్నారు.
మరో వైపు శంబంగి మీద అసంతృప్తి పార్టీలోపలా బయటా అలా పెరిగిపోతోంది అని అంటున్నారు. సర్వేలలో సైతం బొబ్బిలిలో ఫ్యాన్ స్పీడ్ లేదని తెలుస్తోంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేకు ఏకంగా బొబ్బిలి మునిసిపాలిటీ కౌన్సిలర్లు ఎదురు నిలవడం చర్చకు దారి తీస్తోంది. దానికి కారణం ఎమ్మెల్యే శంబంగి వైఖరే అని అంటున్నారు.
మునిసిపాలిటీ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు అవినీతికి పాల్పడుతున్న్నారన్న విషయాన్ని శంబంగి దృష్టికి తీసుకువచ్చినా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మీదనే ద్వజమెత్తుతున్నరు. ఈ విషయంలో వారికి విజయాంగరం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడి బుజ్జగించినా ఎమ్మెల్యేతో నప్పదంటూ దూరంగా ఉంటున్నారు.
ఇక బొబ్బిలిలో వైసీపీ నియోజకవర్గం పార్టీ మీటింగ్ పెడితే 12 మంది వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాశం అవుతోంది. ఎమ్మెల్యే వైఖరి నచ్చకనే తాము దూరంగా ఉంటున్నామని వారు చెప్పడం విశేషం. మొత్తానికి చూస్తే శంబంగి వైఖరితో పార్టీలోని కీలక నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
గడప గడపకు ఆయన తిరుగుతున్నా జన స్పందన కూడా లేదని అంటున్నారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తే ఎలా అన్నదే పార్టీ నేతల మాటగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి వైసీపీకి కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ 2014 నుంచి రెండు సార్లు వైసీపీ గెలిచింది. ఈసారి కూడా గెలీచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే శంబంగికి టికెట్ ఇవ్వవద్దు అంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తోంది. ఆయనకు కాకుంటే ఎవరు అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది ఏది ఏమైనా తానే మళ్లీ పోటీ చేస్తాను అని శంబంగి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.