Begin typing your search above and press return to search.
అనర్హత వేటు అంత ఈజీ కాదా... వైసీపీ ఆగ్రహం చల్లారేదెలా...?
By: Tupaki Desk | 24 March 2023 3:10 PM GMTచేతిలో అధికారం ఉంది. కానీ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే. ఎందుకంటే శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన వారి గుట్టు తెలిసినా రుజువు చేయడం కష్టం. పార్టీలు కోడ్ పెట్టుకుంటాయి, వారిని పట్టుకుంటాయి. కానీ వారేనని రుజువు చేయాలంటే కష్టం అంటున్నారు.
సీక్రెట్ గా బ్యాలెంట్ ఓటింగ్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వారి వ్యూహాలను వాడుతూంటాయి. అలా ఒక కోడ్ పెట్టుకుంటాయి. ఆ కోడ్ ని మిస్ అయినపుడు కచ్చితంగా వారు దారి తప్పారని గ్రహిస్తారు. అది పార్టీ పరంగా వారిని ప్రశ్నించడానికి వీలు ఉంటుందేమో కానీ స్పీకర్ ముందు పెట్టి అనర్హత వేటు వేయడానికి కుదిరే వ్యవహారం కాదు.
అదంత ఈజీ కూడా కాదు. నిజానికి ఓటు అంటేనే అభిమతం. తన అభిమతాన్ని స్వేచ్చగా వ్యక్తం చేసే హక్కు ప్రతీ వారికీ ఉంటుంది. ఇక విప్ జారీ చేయడం అన్నది ఒక విధంగా పార్టీలు తమ వారిని అలెర్ట్ చేయడానికి తప్ప నిజంగా వారే క్రాస్ చేశారని గోడ దాటారని చెప్పడానికి టెక్నికల్ గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
అక్కడే ఇబ్బంది వస్తుంది. ఇక ఇక్కడ మరో చిక్కు ఉంది. వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చారు వారు తమ సొంత పార్టీ విప్ ని ధిక్కరించారు. ఇక వైసీపీ నుంచి మరో నలుగురు వెళ్లి టీడీపీకి మద్దతు ఇచ్చి తమ పార్టీ విప్ ని ధిక్కరించారు. అలాంటపుడు కేవలం తమ పార్టీ వారి మీదనే యాక్షన్ తీసుకుని అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరినా కూడా అవతల తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల విషయం కూడా లెక్క తేల్చాల్సి ఉంటుంది.
వారి మీద కూడా అనర్హత వేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో జనసేన నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా నిలిచిన ఒక ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలా కనుక చూసుకుంటే ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయి. అంటే నిజంగా యాక్షన్ తీసుకుని టెక్నికల్ గా ప్రూవ్ చేసి అనర్హత ప్రకటిస్తే తొమ్మిది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి.
అంటే ఎన్నికల ఏడాదిని ముంగిట పెట్టుకుని తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు పెట్టించుకోవడం అంటే అది బిగ్ రిస్క్ గానే చూడాలి. లేదు మేమే గెలుస్తామని ధీమాకు పోయినా ఫలితాలు జనం చేతుల్లో ఉంటాయి. ఇక ఇపుడు గతంలోలా పరిస్థితి అయితే లేదు. ప్రజలలో ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నపుడు ఉప ఎన్నికలకు తెర లేపడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
ఏమి జరుగుతుందో తెలియదు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమై వైసీపీ మీదకు వస్తే ఓటమి అనుకోకుండా అక్కడా ఎదురైంతే చేజేతులా 2024 ఎన్నికల్లో ఆశలను ముందే కోల్పోయే పరిస్థితిని తెచ్చుకోవడం అన్న మాట. అందువల్లనే మాకు ఎవరు తప్పు చేశారో తెలుసు కానీ వారి పేర్లు బయటపెట్టమని సజ్జల రామక్రిష్ణారెడ్డి చాలా వ్యూహంతోనే చెప్పారనుకోవాలి.
అంటే వైసీపీ చేయగలిగింది పార్టీ పరంగా చర్యలు. వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా దూరం పెట్టడం చేయడం అన్న మాట. ఉన్నది ఒక్క ఏడాదే కాబట్టి వారిని అలా వదిలేయడం అన్న మాట. సరే ఇలా చేయడం వల్ల వైసీపీ ఆగ్రహం చల్లారుతుందా అంటే అది చల్లారదు, మరి ఏమి చేయాలీ అంటే ప్రస్తుతానికైతే కోపాన్ని అలా నిభాయించుకోవడమే. ఇప్పటికి రాజకీయంగా చూస్తే అదే సరైన వ్యూహంగానే మేధావులు సూచిస్తారు. అంతే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.