Begin typing your search above and press return to search.
ఆర్థికసంక్షోభంలో డిస్నీ ల్యాండ్.. 28వేల మందిపై వేటు!
By: Tupaki Desk | 30 Sep 2020 11:30 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్.. డిస్నీల్యాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. కరోనా వైరస్ ప్రభావం డిస్నీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. కరోనాతో డిస్నీ ఎడెనిమిది నెలలుగా బోసిపోయింది. సందర్శకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల సందర్శనకు వస్తున్న వారి సంఖ్యలోనూ భారీగా తగ్గుదల నమోదవుతోంది.
డిస్నీ ల్యాండ్ ప్రధాన ఆదాయ వనరు థీమ్ పార్క్, రిసార్టులు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ రెండు దారుణంగా దెబ్బతిన్నాయి. సందర్శకులు లేక చాలాకాలం నుంచి బోసిపోయాయి. నిర్వహణ భారం పెరగడం ఉద్యోగులకు వేతనాల చెల్లించాల్సి రావడంతో డిస్నీ ల్యాండ్ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. వారికి వేతనాలు చెల్లించలేక ఏకంగా వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 28వేల మంది ఉద్యోగులను డిస్నీల్యాండ్ తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమెరికాలోని పలు నగరాల్లో డిస్నీ ల్యాండ్ థీమ్ పార్కులు, రిసార్టులు ఇప్పుడు మూసిపోయాయి. లక్షలమంది రోడ్డున పడ్డారు. కరోనాతో దేశీయ పర్యాటకులు రాక.. విదేశీ పర్యాటకులు రాక డిస్నీ ల్యాండ్ కు ఆదాయం పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయి 28వేల మందికి లేఆఫ్ ప్రకటించింది.
కరోనా కారణంగా డిస్నీ ల్యాండ్ ఏకంగా బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని ఆ సంస్థ తెలిపింది. దీంతో బుకింగ్స్ అన్ని రద్దు చేశామని.. ఇప్పుడు పార్కులు తెరిచినా ఎవరూ రావడం లేదని సంస్థ నష్టాల్లో ఉందని పేర్కొంది.