Begin typing your search above and press return to search.
దిశా రవి అరెస్టు.. సీన్లోకి బ్రిటన్ ఎంపీ: వెంటనే స్పందించిన భారత్..
By: Tupaki Desk | 17 Feb 2021 9:30 AM GMTకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై ఆంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొందరిని కేంద్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలో భాగంగా ఘర్షణ వాతావరణానికి కారణమైన దిశా రవి, ఇతరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే దిశా రవికి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తాజాగా బ్రిటన్ ఎంపీ క్లాడియా వెబ్బే దిశా రవి అరెస్టుపై స్పందించారు. అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం మేలుకొని బ్రిటన్ ఎంపీకి ఓ లేఖను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇందులో ఓ రైతు చనిపోవడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. అయితే అంతకుముందు బెంగుళూరుకు చెందిన దిశా రవి అనే పర్యావరణ కార్యకర్తను ‘టూల్ కిట్’ ద్వారా అల్లర్లను ప్రేరేపించారని గత సోమవారం ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు తోడుగా ముంబైకి చెందిన నికితా జాకబ్, శంతన్ లను కూడా అరెస్టు చేశారు. ఆమె అల్లర్లను ప్రేరేపించేందుకు స్వీడన్ పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్ సాయం తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు.
అయితే దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఈ విషయం తెలిసిన విదేశీయులూ స్పందిస్తున్నారు. తాజాగా బ్రిటన్ ఎంపీ క్లాడియా తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను ఉంచారు. అందులో ‘21 సంవత్సరాల సామాజిక కార్యకర్త దిశా రవి, మరి కొందరు అరెస్టయ్యారు. దీన్ని చూస్తూ ఊరుకోవద్దు.. రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారికి మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేస్తున్నారు.. ఇలాంటి అణచివేత చర్యలు స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడి దారి విధానానికి, అధికారవాదానికి దారి తీస్తాయి..’అని ఆమె విమర్శించారు.
ఈ ట్వీట్ పై భారత్ స్పందించింది. వెంటనే బ్రిటన్ లోని భారత హై కమిషన్ ఓ లేఖను విడుదల చేసింది. ‘వ్యసాయ చట్టాలను తాము ఏకపక్షంగా రూపొందించలేదు. వంద కోట్ల రైతుల ప్రయోజనాల కోసమే తయారు చేశారు. ఈ చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తాము రాజీపడబోము’ అని లేఖలో పేర్కొన్నారు.