Begin typing your search above and press return to search.
మా బిడ్డను చంపినప్పుడు ఏమైంది ఈ NHRC?
By: Tupaki Desk | 7 Dec 2019 7:56 AM GMTదిశ ఎన్ కౌంటర్ పై విచారణకు ఢిల్లీ నుంచి మానవహక్కుల సంఘం ప్రతినిధులు శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఎన్ కౌంటర్ ప్రదేశం సహా మృతదేహాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దిశ తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం ప్రమేయంపై మండిపడ్డాయి.
దిశ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘మరి మా కూతురు చనిపోయినప్పుడు మానవ హక్కుల సంఘం ఎందుకు స్పందించలేదు? గ్యాంగ్ రేప్ చేసి.. కాల్చినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదా? నేరస్థులు చనిపోతే మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుంది? ’ అని వారు మానవహక్కుల సంఘాన్ని ప్రశ్నించారు.
వరంగల్ లో 9 నెలల చిన్నారిపై రేప్ చేసి హత్య చేశారని.. ఆసిఫాబాద్ లో రేప్ చేసి మహిళను చంపారని.. హాజీపూర్ లో ముగ్గురు బాలికను రేపిస్టు చంపాడని.. ఈ హత్యలపై NHRC ఎందుకు నోరు మెదపలేదని దిశ తల్లిదండ్రులు నిలదీశారు. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ ను సమాజమే కోరుకుందని.. ఇలాగైతేనే అన్యాయం జరిగిన వారికి సత్వర న్యాయం చేకూరుతుందని దిశ తల్లిదండ్రులు స్పష్టం చేశారు. NHRC సభ్యుల పర్యటనను తీవ్రంగా తప్పుపట్టారు.