Begin typing your search above and press return to search.
దిశ కేసు : హైదరాబాద్ కు చేరుకున్న జ్యుడీషియల్ కమిటీ
By: Tupaki Desk | 3 Feb 2020 11:06 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కేసులో సుప్రీంకోర్టు వేసిన జ్యుడీషియల్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. ఈ కమిటీ హైకోర్టులో విచారణ చేయనున్నది. హైకోర్టు సీ బ్లాక్ లో కమిటీ ఉండనుంది. కమిటీ సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేసింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జితో పాటు, ఓ న్యాయవాది, సిబిఐ మాజీ డైరెక్టర్ ఈ కమీషన్‌లో సభ్యులుగా ఉన్నారు.
ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఆరా తీసే క్రమంలో... నిందితుల పోస్టుమార్టం రిపోర్టు, రీ పోస్టుమార్టం నివేదికలను కమిటీ పరిశీలించనుంది అదే విధంగా ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ నుంచి వివరాలు సేకరించనుంది. మూడు రోజుల పాటు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై కమిషన్ వివరాలు సేకరించనుంది. అలాగే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ చేయనుంది. ఇక హైకోర్టు వేదిక గా కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం లో సీఆర్పీఎఫ్ బలగాల తో ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.