Begin typing your search above and press return to search.

మైదానంలో రచ్చ.. ఫీల్డర్ ని కొట్టబోయిన వికెట్ కీపర్

By:  Tupaki Desk   |   15 Dec 2020 6:07 AM GMT
మైదానంలో రచ్చ.. ఫీల్డర్ ని కొట్టబోయిన వికెట్ కీపర్
X
క్యాచ్​ మిస్ అయిపోతుందేమోనన్న టెన్షన్​లో బంగ్లాదేశ్​ వికెట్​ కీపర్​ ముష్ఫికర్ రహీమ్ సహనం కోల్పోయాడు. తోటి ఫీల్డర్​పైకి చెయ్యెత్తాడు. లిప్తపాటులో తనను తాను నియంత్రించుకున్నాడు కానీ.. లేదంటే కొట్టేవాడు. ముష్ఫికర్ రహీమ్ స్టేడియంలో విచక్షణ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ముష్ఫికర్ తీరును క్రికెట్​ అభిమానులు తప్పుపడుతున్నారు.

క్రికెట్​లో ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్​ గ్యాప్​ రావడం సహజమే. కానీ అంతమాత్రానికి తోటి ఆటగాడిని దూషించడం.. కొట్టడానికి వెళ్లడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా కీపర్​ తీరును తప్పుపడుతున్నారు. తోటి ఫీల్డర్​, సహచరుడు అన్న గౌరవం లేకుండా అలా ప్రవర్తించడం సంస్కారం కాదని క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం బంగ్లాదేశ్​ లో బంగబంధు టీ20 కప్‌లో సీరిస్​ జరుగుతున్నది. ఆ క్రమం లో ఓ ఫాస్ట్​ బౌలర్​ విసిరిన బంతిని బ్యాట్స్​మెన్​ ఫైన్​ లెగ్​ దిశగా భారీ షాట్​ కు ఆడాడు. కానీ కనెక్షన్​ కుదర లేదు. బంతి.. బ్యాట్​ కొనకు తాకి గాల్లోకి ఎగిరింది.

వికెట్​ కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​..
ఫీల్డర్ అహ్మద్ ఒకేసారి ఈ క్యాచ్​ పట్టుకొనేందుకు వచ్చారు. ఇద్దరూ ఢీ కొట్టుకున్నారు. కానీ బంతి మాత్రం కీపర్​ చేతి లో పడింది. అయితే క్యాచ్​ కోసం తాను వస్తున్నప్పుడు.. నువ్వు ఎందుకు వచ్చావంటూ ఫీల్డర్​ అహ్మద్​ పై కీపర్ ముష్ఫికర్ ఆగ్రహం ప్రదర్శించాడు. ఓ దశలో విచక్షణ కోల్పోయి అతడిమీదకు చెయ్యిఎత్తాడు. ఆ తర్వాత వెంటనే నియంత్రించుకుని వెనక్కి తగ్గాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. దీంతో కీపర్​ తీరుపై విమర్శలు వస్తున్నాయి.