Begin typing your search above and press return to search.

పీక్స్ కు చేరిన ఫ్రస్ట్రేషన్..రష్యన్ ఏం చేసాడంటే ?

By:  Tupaki Desk   |   26 Dec 2019 9:33 AM GMT
పీక్స్ కు చేరిన ఫ్రస్ట్రేషన్..రష్యన్ ఏం చేసాడంటే ?
X
ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయి. అందులో కొన్ని తీరే కలలు అయితే , మరికొన్ని ఎప్పటికి తీరని కలలు. కానీ , కలలని నిజ జీవితంలో తీర్చుకోవాలి అని కష్టపడితే తీరని కల అంటూ ఉండదు. అలాగే రష్యా కి చెందిన మొరోజ్ ఇగోర్ అనే ఒక వ్యక్తికీ కూడా ఒక కల ఉండేది. ఎప్పటికైనా ఒక ఖరీదైన కారు కొనాలనేది అతని కల. దానికోసం పగలు - రాత్రి కష్టపడి ఆ కలని తీర్చుకున్నాడు. ఎట్టకేలకి ఈ ఏడాది మార్చి లో రెండు లక్షల 70 వేల డాలర్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ… జీ 63 కారుని కొన్నాడు. తనకి బాగా ఇష్టమైన - ఖరీదైన కారుని అయితే కొన్నాడు కానీ ... తాజాగా అదే కారుని హెలికాఫ్టర్ తో భూమి నుండి 100 అడుగుల పైకి తీసుకువెళ్లి ..కిందకి విసిరేసాడు. అదేంటి ఎంతో కష్టపడి ..తన కలని తీర్చుకున్న తరువాత ..అంట ఖరీదైన కారుని ఎందుకు ఆలా అంత ఎత్తు నుండి పడేసాడు అని ఆలోచిస్తున్నారా ? అయితే ..

పూర్తి వివరాలు చూస్తే ... రష్యాలో నివాసం ఉంటున్న మొరోజ్ ఇగోర్ కి చిన్నప్పటి నుండి కొంచెం కోపం ఎక్కువ. అలాగే విసుగూ కూడా ఎక్కువే - తన ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక చాలా అవస్థలు పడుతుంటాడు. ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలోనే తన కలని తీర్చుకున్నాడు. తనకి బాగా ఇష్టమైన , ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ… జీ 63 ని కొన్నాడు. కానీ - ఆ కారు తీసుకున్న సమయం నుండి అతనికి అన్ని సమస్యలే. కారు లో ప్రయాణం చేసింది తక్కువ ..దాన్ని రిపేర్ చేపించింది ఎక్కువ. ఒకానొక సమయంలో సర్వీసింగ్ మెకానిక్ కూడా ఇక దీనికి తాను రిపేర్ చేయలేనని చేతులెత్తేశాడట, కొన్ని సందర్భాల్లో దీని విషయమై ఇగోర్ - మెకానిక్ మధ్య చిన్న పాటి గొడవలు కూడా అయ్యాయట.

ఇదే సమయంలో ఓ కాంట్రాక్ట్ విషయంలో ఇగోర్ - ఇగోర్ స్నేహితునికి మధ్య ఒక వివాదం వచ్చింది. దీనితో వీరిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ తరుణంలో ఆ ఒప్పందంలో తాను ఓడిపోతే.. తన మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని వెరైటీగా నాశనం చేస్తానని ఇగోర్ తన స్నేహితునితో పందెం కట్టాడు. ఆ పందెంలో ఇగోర్ ఓడిపోవడంతో ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం .. ఆ ఖరీదైన కారుని నాశనం చేశాడు. ఈ పనికి అనువుగా ఈ ఇద్దరి స్నేహితుల కోర్కెను తీర్చడానికి ఓ చిన్న విమానాశ్రయాన్ని కేటాయించేందుకు రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు కూడా అంగీకరించారు. ఓ రోజు మంచు కురుస్తున్న వేళ.. ఇగోర్ తన ప్రామిస్ నెరవేర్చుకుని.. ఆ వాహనాన్ని వదిలించుకున్నాడు. హెలికాఫ్టర్ నుంచి కింద పడిపోయిన ఆ బెంజ్ వాహనం కొన్ని నిముషాల్లోనే నాశనమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.