Begin typing your search above and press return to search.
మహమ్మారి గుట్టు బయట పెట్టాల్సిందే .. స్వతంత్ర దర్యాప్తుకి భారత్ మద్దతు !
By: Tupaki Desk | 18 May 2020 7:30 AM GMTచైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని చాలాదేశాలు ఇప్పుడు గజగజవణికిపోతున్నాయి. అలాగే , ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశానికీ ఇంకో దేశంతో సంబంధం లేకుండా పోయింది. దాదాపు గత రెండు నెలలుగా జన జీవనం స్తంభించింది. విమాన ప్రయాణాలు ఆగిపోయాయి. ముఖ్యంగా అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా సైతం ఈ వైరస్ దెబ్బకి అల్లాడిపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి గుట్టు రట్టు చేసేందుకు 62 ప్రపంచదేశాలు ఏకతాటి పైకి వచ్చాయి. మానవాళిని సంక్షోభంలోకి నెట్టేసిన ఈ మహమ్మారి ఎక్కడ పుట్టింది. జంతువుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించింది .. అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరగాలని అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ ను డిమాండ్ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభంకానున్న డబ్ల్యూహెచ్ వో వార్షిక సదస్సు వేదికగా ఈమేరకు ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ముసాయిదా తీర్మానానికి యూరోపియన్ యూనియన్ కు చెందిన 27 దేశాలు, భారత్, బంగ్లాదేశ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, కెనడా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా సహా 35 దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కు రాసిన ఈ ఏడు పేజీల తీర్మానంలో చైనా పేరుకానీ, వూహాన్ నగరం పేరుకానీ ప్రస్తావించలేదు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ సహాయంతో కరోనా మహమ్మారి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిన ఆనుపానులపై, ఆ రెండింటి నడుమ వాహకాలుగా పనిచేసిన జీవరాశుల పాత్రపై అధ్యయనం చేయాలని డబ్ల్యూహెచ్ వో కు సూచించాయి.