Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ ఆ సాహసం చేస్తారా?
By: Tupaki Desk | 27 Aug 2016 4:11 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు (శనివారం) తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభపై మిగిలిన అన్ని పార్టీల కార్యకర్తలు - జనాల పరిస్థితి ఎలా ఉన్నా.. జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఫుల్ ఉత్సాహంగా ఉన్నారట. ఈ వేదికపై పవన్ కచ్చితంగా జనసేన కు సంబందించిన విషయాలే మాట్లాడతారనేది వారి నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని భావిస్తున్న చాలా మంది అభిమానులు - అభిమాన సంఘాల నాయకులు ఈ మేరకు పవన్ కు ఎప్పటినుంచో విజ్ఞప్తులు చేస్తున్నారట. దీంతో పవన్ జనసేన పార్టీ గురించే మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారట.
అయితే అభిమానులు కోరుకుంటున్నట్లు - జనసేన కార్యకర్తలు ఆశిస్తున్నట్లు పవన్ "జనసేన" పార్టీ కార్యక్రమాలు - పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియల గురించి మాట్లాడితే మాత్రం ఇది రాజకీయంగా సంచలనమే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కూడా పవన్ కు మంచి స్థానమే ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలు ఆ ప్రాంతంలో గెలవడంతో ఇది కొంత నిరూపితమైంది. సామాజిక వర్గ కోణంలోనూ - కొత్తదనం కొరుకునేవారిలోనూ - ముఖ్యంగా యువతలోనూ పవన్ కు మాంఛి ఫాలోయింగే ఉండటం కచ్చితంగా కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి!
అయితే తిరుపతి సభలో పవన్ ప్రస్థావించే అంశాల్లో జనసేన పార్టీ విషయాలు - కార్యకర్తలకు కొత్త ఉత్సాహం తెచ్చేవిషయాలు ఉంటే.. ఆ పార్టీ ఉనికిని చాటుకోవడానికి - ప్రజల్లో బలంగా దూసుకుపోవడానికి కచ్చితంగా "ప్రత్యేక హోదా"అనే అంశాన్నే ఎత్తుకోవలసి ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలా చేయాలంటే కచ్చితంగా కేంద్రంలో బీజేపీని - రాష్ట్రంలో టీడీపీని ఏకిపారెయ్యాలి. అయితే ఈ పరిస్థితుల్లో పవన్ ఆ సాహసం చేస్తారా? మద్యాహ్నం వరకూ వేచి చూడాలి!