Begin typing your search above and press return to search.

న‌ట్టింట్లో కాయాన్ని పెట్టుకొని ఈ వాదులాట‌లేంటి?

By:  Tupaki Desk   |   8 Aug 2018 7:46 AM GMT
న‌ట్టింట్లో కాయాన్ని పెట్టుకొని ఈ వాదులాట‌లేంటి?
X
విషాదంలోనో.. మ‌రింకే మూడ్ లోనో చెబుతున్న మాట‌లు ఎంత‌మాత్రం కావు. ఒక వ్య‌క్తి ఎలాంటి వాడైనా కావొచ్చు. కానీ.. ఆ మ‌నిషి ఈ ప్ర‌పంచం నుంచి నిష్క్ర‌మించిన వేళ‌.. అత‌నికి ఇవ్వాల్సిన గౌర‌వానికి మించిన గౌర‌వం.. మ‌ర్యాద ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ల‌బ్థి పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. వాడి పాపాన వాడు పోతాడ‌ని అనుకోవాలే కానీ.. కోర్టుల‌కు ఎక్కి వాదించుకోవ‌టం ఏమైనా స‌బ‌బా?

అంత్య‌క్రియ‌లు మెరీనా బీచ్ లో.. అన్నా స్వ్కేర్ కు ప‌క్క‌నే క‌రుణ అంత్య‌క్రియ‌లు చేసేందుకు ప‌ళ‌ని సర్కార్ అనుమ‌తిస్తే పోయేదేంటి? అన్నా అంత‌టోడు మా క‌రుణ అని భ‌విష్య‌త్ త‌రాలు డీఎంకేను నెత్తిన పెట్టుకుంటార‌నా? లేక‌.. త‌మ అమ్మ‌కు పోటీగా క‌రుణ ఉండ‌టం ఏమిట‌ని అనుకుంటున్నారా?

కోర్టులో జ‌రిగిన వాద‌న‌లు విన్న‌ప్పుడు ఒక ప్ర‌జా నాయ‌కుడి అంత్యక్రియ‌ల కోసం ప‌ళ‌ని స‌ర్కార్ మ‌రీ అంత దారుణంగా వ్య‌వ‌హ‌రించాలా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. అంతేనా.. మోడీ పాత్ర కూడా లేదా? అంటే ఉంద‌ని చెప్పాలి. త‌న త‌ల్లిని త‌న ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకోకున్నా.. క‌రుణ‌ను మాత్రం త‌న ఇంటికి తీసుకెళ్లి.. ఆయ‌న‌కు మంచి డాక్ట‌ర్ల‌కు చూపిస్తానంటూ ఆఫ‌ర్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ తాజా ఎపిసోడ్‌ లో ఎందుకు క‌లుగ‌జేసుకోన‌ట్లు?

పెద్దాయ‌న వెళ్లిపోయారు. ఆయ‌న అంతిమ‌యాత్ర సంద‌ర్భంగా ఈ లొల్లి ఏంది? ఫ‌ర్లేదు.. క‌రుణ కుటుంబ స‌భ్యులు.. ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్లే మెరీనా ద‌గ్గ‌ర అంత్య‌క్రియ‌లు చేసే విష‌యంలో పేచీ పెట్ట‌కుండా జ‌ర‌గాల్సిన ప‌నిని జ‌రిగేలా చేయండ‌న్న మాట‌ను ఎప్ప‌టిలానే.. అదృశ్య శ‌క్తి ద్వారా ఆదేశాలు ఇప్పిస్తే మోడీ సొమ్ములు ఏమైనా పోతాయా?

ప‌ళ‌ని స‌ర్కార్ ఎంత స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇస్తే కానీ.. వారి త‌ర‌ఫున వాదించిన లాయ‌ర్‌.. సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోలేర‌ని.. రాత్రికి రాత్రే మేనేజ్ చేసి మెరీనా బీచ్ లో ప‌లువురి స్మాక‌రాల‌పై అంత‌కు ముందు దాఖ‌లైన పిటిష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునేలా చేశారంటూ వాద‌న‌లు వినిపించ‌టంలో అర్థ‌మేంది?

స‌రే.. ఒక‌వేళ నిజంగానే డీఎంకే నేత‌లు చేశారే అనుకుందాం. వారంతా ఎందుకు ఒప్పుకున్న‌ట్లు.. ఒక మ‌హా నేత మ‌ర‌ణించిన విషాదంలో ప్ర‌జ‌ల భావోద్వేగానికి త‌లొగ్గిన‌ట్లుగా ఎందుకు ఫీల్ కాకూడ‌దు? ఒక‌వేళ‌.. క‌రుణ‌ను అన‌వ‌స‌రంగా రుద్దే ప్ర‌య‌త్నం క‌రుణ కుటుంబీకులు చేస్తున్నార‌నుకుందాం? త‌మిళ ప్ర‌జ‌లు అంత అమాయ‌కులేం కారుగా? వారికి వారుగా వారి స్వేచ్ఛ‌ను.. వారి భావోద్వేగాల్ని ప్ర‌ద‌ర్శించుకునే చైత‌న్యం పుష్క‌లంగా ఉంద‌ని మ‌ర్చిపోకూడ‌దు. అలాంట‌ప్పుడు.. రాజ‌కీయ స్వార్థంతో ఇంత దారుణంగా... గ‌లీజుగా కోర్టుల్లోకి వ‌చ్చి వాదించుకునే తీరు.. న్యాయ‌మూర్తుల‌కు కూడా మంట పుట్టిన‌ట్లుంది. అందుకే కాబోలు.. క‌రుణానిధి అంత్యక్రియ‌ల్ని వారం పాటు వాయిదా వేద్దామా? అంటూ సీరియ‌స్ గా వ్యాఖ్యానించారు.ఈ మొత్తం వ్య‌వ‌హారంలో మ‌రింత మంది మ‌న‌సుల్ని క‌లిచి వేసిందేమంటే.. మెరీనాలో క‌రుణ అంత్య‌క్రియ‌ల‌కు కోర్టు క్లియ‌రెన్స్ ఇచ్చిన త‌ర్వాత స్టాలిన్ క‌న్నీటి ప‌ర్యంతం కావ‌టం. రాష్ట్రాన్ని ఐదుసార్లు ఏలిన వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. త‌న అంత్య‌క్రియ‌లు త‌న కుటుంబ స‌భ్యులు..త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల కోరిక తీరేలా చేయ‌టం కోసం ఇంత‌లా వాద‌న‌లు జ‌ర‌గాలా? అన్న‌ట్లుగా స్టాలిన్ క‌న్నీళ్లు ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.