Begin typing your search above and press return to search.
పవన్ దారి రహదారే ఇక!!
By: Tupaki Desk | 4 Nov 2016 11:30 AM GMTపూర్తి స్థాయి రాజకీయవేత్తగా మారుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులపై పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన బీజేపీతో పవన్ కు దూరం పెరుగుతోందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో సంబంధాలకు పూర్తిస్థాయిలో తెరపడిందని తేల్చేస్తున్నారు. ఏపీ ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయని విశ్లేషకుల మాట.
ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా సిద్దార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ ఎన్డీఏలో లేరని - ఆయన కేవలం గత ఎన్నికల్లో తమకు మద్దతు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో కూడా పవన్ ఎన్డీఏలో ఉన్నారో - లేరో ఆయనే చెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ ఇన్చార్జి వ్యాఖ్యలతో పాటు - బీజేపీ సీనియర్ల విశ్లేషణ ప్రకారం చూసినా పవన్ బీజేపీకి దూరమవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని బీజేపీని విమర్శిస్తున్నారని, విభజనలో తెదేపాతో సహా అన్ని పార్టీల పాత్ర ఉండగా పవన్ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. విభజనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు లేఖ ఇవ్వడంతో పాటు నాటి ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా ‘మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టండి - మేం మద్దతునిస్తాం’ అని సవాల్ విసిరిన విషయాన్ని పవన్ ఎందుకు తన సభల్లో ప్రస్తావించడం లేదో అర్థంకావడం లేదంటున్నారు.
ఈ సందర్భంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం బీజేపీ నేతలను అనుమానాస్పదంగా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇప్పటికీ తనకు నమ్మకం - అభిమానం ఉందని చెబుతున్న పవన్ వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. తన ప్రసంగంలో పైకి తెదేపా ఎంపీలను విమర్శిస్తున్న పవన్ - అసలు పార్టీ విధానాన్ని నిర్దేశించే అధ్యక్షుడు చంద్రబాబు జోలికి మాత్రం వెళ్లకపోవడానికి కారణాలు సులభంగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. కాగా ఈ నెల 10న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో కూడా ఆయన బిజెపినే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తారని సమాచారం. పవన్ ఇప్పటివరకూ కాకినాడ - తిరుపతిలో నిర్వహించిన సభల్లో కూడా ప్రత్యేక హోదాపై బీజేపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శించిన విషయం తెలిసిందే. అనంతపురంలో కూడా అదే ధోరణి కొనసాగిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన తెదేపాతో కలిసి వెళుతుందన్న సమాచారం తమకు ఉందని, కాపుల ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలన్న వ్యూహంతోనే ఈ సమీకరణలు జరుగుతున్నాయంటున్నారు. ఈవిషయంలో 2004 - 2009లో వైఎస్ అనుసరించిన వ్యూహాన్నే తెదేపా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2004లో లోక్ సత్తా - 2009లో పీఆర్పీతో తెదేపా నష్టపోయిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/