Begin typing your search above and press return to search.

మైనార్టీ ఓటు బ్యాంకును ఏం చేద్దాం... టీడీపీలో చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   28 Dec 2021 4:17 AM GMT
మైనార్టీ ఓటు బ్యాంకును ఏం చేద్దాం... టీడీపీలో చ‌ర్చ‌
X
మైనారిటీ ఓటు బ్యాంకు.. ఇది ఇప్పుడు అన్ని పార్టీల‌కూ అత్యంత కీల‌కం. 2014లో 5 శాతం ఉన్న వీరి ఓటు బ్యాంకు.. ఇప్పుడు 12 శాతం పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అంటే.. 2019 నాటికి ఇది మ‌రో శాతం పెరిగే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. దీంతో ఈ ఓటు బ్యాంకును కైవ‌సం చేసుకుంటే.. తమ‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు నాయ‌కులు.

అయితే.. ప్ర‌స్తుతం వైసీపీకి అనుకూలంగా ఈ ఓటు బ్యాంకు ఉంది. వైఎస్ హ‌యాం నుంచి కూడా మైనారిటీ ఓటు బ్యాంకును స్థిర‌ప‌రుస్తూ నాయ‌కులు అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. అప్ప‌ట్లో వారికి 4 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. అయితే.. కోర్టు దీనిని కొట్టేసినా.. సాను భూతి అయితే అలానే నిల‌బ‌డి పోయింది.

ఆ త‌ర్వాత‌.. మైనారిటీలు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం వైసీపీ వైపు మ‌ళ్లారు. అయితే.. ఆదిలో వీరి ఓటు బ్యాంకుపై ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ.. త‌ర్వాత కాలంలో మాత్రం.. వీరి ఓటు బ్యాంకు పెరుగు తుండ‌డంతో.. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును త‌మ‌వైపు మ‌ళ్లించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌భుత్వంలో ఉన్న స‌మయంలోనే శాస‌న మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని ఈ వ‌ర్గానికి ఇచ్చారు. అయితే.. ఇది ఆశించినంత మేర‌కు ఫ‌లితం ఇవ్వ‌లేదు. పైగా మైనారిటీ వ‌ర్గాలు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ఈ వ‌ర్గం టీడీపీ వైపు మ‌ళ్ల‌లేక పోయారు. కానీ, ఇదే ప‌రిస్థితి ఇలానే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత న‌ష్టం వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌నీసం.. ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా.. మైనారిటీల‌కు టికెట్లు ఇవ్వాలని.. భావిస్తున్నారు. అయితే.. ఆ మేర‌కు.. నాయ‌కులు ఉన్నారా ? ఉన్నా.. గెలుపు గుర్రం ఎక్కుతార‌నే న‌మ్మ‌కం ఉన్న‌వారు ఎవ‌రు? అనేచ‌ర్చ జోరుగా సాగుతోంది. కానీ, ఇవ్వాల‌నే వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది.

మ‌రో వైపు వైసీపీ మైనార్టీల‌కు విప‌రీత‌మైన ప్ర‌యార్టీ ఇస్తోంది. ఇప్ప‌టికే మండ‌లి నుంచి ఏకంగా న‌లుగురు ఎమ్మెల్సీల‌కు అవ‌కాశం ఇచ్చింది. ఇక స్థానిక ప‌ద‌వుల్లో కూడా వారికి ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీ కూడా మైనార్టీల‌కు ప్రాధాన్య‌త పెంచాల‌ని చూస్తోంది. ముఖ్యంగా క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, విజ‌య‌వాడ త‌దిత‌ర కీల‌క ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీల‌కు అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌నే.. చ‌ర్చ సాగుతోంది. అయితే.. టికెట్ల కోసం ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఎందుకంటే.. వైసీపీ దూకుడు ముందు తాము గెలుస్తామోలేదో.. అనే సందేహాలు ఉండ‌డ‌మే. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.