Begin typing your search above and press return to search.
షాకిచ్చిన ఫోర్డు.. భారత్ లో తయారీ నిలిపివేత.. ఇప్పుడేం జరుగుతుంది?
By: Tupaki Desk | 10 Sep 2021 4:26 AM GMTవాహనప్రియులకు ఫోర్డు ఇండియా షాకిచ్చింది. అమెరికాలో వాహన దిగ్గజ కంపెనీ అయిన ఫోర్డు.. భారత్ లో తన వాహనాల తయారీని నిలిపివేయనున్నట్లుగా ప్రకటించింది. దేశంలో తనకున్న రెండు తయారీ ఫ్లాంట్లను మూసివేస్తామని ప్రకటించింది. భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ నష్టాల్ని మాత్రమే నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఫోర్డ్ మోటార్ ప్రెసిడెంట్ .. సీఈవో జిమ్ ఫార్లే వెల్లడించారు.
కొత్త వాహనాలకు ఆశించినంత స్థాయిలో గిరాకీ లేకపోవటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించారు. గడిచిన 30 ఏళ్లలో ఈ సంస్థ దేశంలో రూ.18,750 కోట్ల పెట్టుబడుల్ని పెట్టింది. అయితే.. పదేళ్ల కాలంలో దాదాపు రూ.15వేల కోట్ల నష్టాల్ని మూటగట్టుకోవటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా నిర్ణయంతో 4వేల మంది ఉద్యోగులు.. 300 షోరూంలు.. వాటిని నిర్వహిస్తున్న 150 మంది డీలర్ల మీదా ప్రభావం పడనుంది.
మరి.. ఫోర్డు వాహనాల్ని కొనుగోలు చేసిన వాహనదారులకు మాత్రం సేవల్ని కొనసాగిస్తామని పేర్కొంది. వినియోగదారులకు సేవలు.. విడిభాగాలనుఅందుబాటులో ఉంచటం.. వారెంటీ లాంటివి యథాతధంగా కొనసాగిస్తామని పేర్కొంది. భారత్ లో ఫోర్డు ఇండియాకు తమిళనాడులోని చెన్నై.. గుజరాత్ లోని సునంద్ లో ఫ్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లలో ఎకో స్పోర్ట్.. ఫిగో.. యాస్పైర్.. ఎండావర్.. ఫ్రీస్టైల్ వాహనాల్ని తయారుచేస్తుననారు. 2021 నాలుగోత్రైమాసికం నుంచి సునంద్ ప్లాంటులో వాహనాల అసెంబ్లింగ్ ను.. 2022 రెండో త్రైమాసికంలో చెన్నై ప్లాంట్ లోని వాహనాలు.. ఇంజిన్ల తయారీని నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది. సునంద్ ప్లాంట్ లో మాత్రం ఇంజిన్ల తయారీ కొనసాగుతుందని పేర్కొంది.
డీలర్ల వద్ద ఉన్న ఫిగో.. యూస్పైర్.. ఫ్రీ స్టైల్.. ఎకో స్పోర్ట్.. ఎండీవర్ వాహనాల అమ్మకాల్ని నిలిపివేస్తామని పేర్కొంది. మస్టాంగ్ కూపే లాంటి దిగుమతి చేసిన వాహనాల్ని మాత్రమే రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో అమ్మనున్నారు. ఏటా 6.10లక్షల ఇంజిన్లు.. 4.40లక్షల వాహనాల్ని తయారు చేసే సామర్థ్యం ఫోర్డ్ ఇండియా ప్లాంట్ కు ఉన్నా.. ఇందులో 21 శాతం సామర్థ్యాన్ని మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఫోర్డు పేర్కొంది. ఈ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం చూస్తోంది. ఫోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఇప్పటికే ఆ వాహనాల్ని కొనుగోలు చేసిన వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. వారి వద్ద ఉన్న వాహనాల విలువ భారీ ఎత్తున పడిపోనుంది. అన్నింటికి మించి రీసేల్ వాల్యూపై ప్రభావం పడనుంది. అయితే.. ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న రెండేళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.