Begin typing your search above and press return to search.

కమల్‌ హాసన్‌ కు నిరాశ .. టార్చ్‌లైట్ పోయింది !

By:  Tupaki Desk   |   16 Dec 2020 5:44 AM GMT
కమల్‌ హాసన్‌ కు నిరాశ .. టార్చ్‌లైట్ పోయింది !
X
తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా ఇప్పటినుండే పక్కా ప్రణాళికలతో ముందుకు అడుగులువేస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా అధికారమే ద్యేయంగా ముందుకుసాగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో రజినీ కూడా బరిలోకి దిగుతుండటం తో తమిళనాడు లో పోటీ రసవత్తకరంగా సాగుతుంది అంటూ రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఈ ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఈసీ కమల్ కి బిగ్ షాక్ ఇచ్చింది. మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ చిహ్నం ను దూరం చేసింది.

టార్చ్‌ లైట్‌ చిహ్నం ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి దక్కింది. తమ చిహ్నం దూరం కావడంతో కమల్ కొంచెం నిరాశకి లోనైయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందుగా కమల హాసన్‌ మక్కల్‌ నీదిమయ్యం పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కొంత మేరకు ఓటు బ్యాంక్‌ ను దక్కించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు నినాదంతో ప్రచార ప్రయాణాన్ని సైతం మదురై నుంచి మొదలెట్టారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు కేటాయించిన టార్చ్ ‌లైట్‌ ను పార్టీ చిహ్నంగా మార్చుకొని ప్రచార చేస్తున్న ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ చిహ్నంను ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి తాజాగా అప్పగించడంతో కమల్ కి షాక్ ఇచ్చింది.

అయితే , తమకు ఎన్నికల కమిషన్‌ చిహ్నం కేటాయించని దృష్ట్యా, టార్చ్ ‌లైట్‌ దక్కించుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు మక్కల్‌ నీది మయ్యం వర్గం.ఈ విషయం పై కమల్‌ ను ప్రశ్నించగా, టార్చ్‌ లైట్‌ దూరమైనా లైట్ ‌హౌస్‌ వలే ప్రజలకు వెలుగు నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిహ్నం విషయంగా తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్ ‌కు ప్రెషర్‌ కుక్కర్‌ చిక్కడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగారు.