Begin typing your search above and press return to search.

క్రికెట్ అభిమానులకు నిరాశ.. ఒలింపిక్స్ లో కలేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2021 1:30 AM GMT
క్రికెట్ అభిమానులకు నిరాశ.. ఒలింపిక్స్ లో కలేనా?
X
ఎప్పుడో 1900 పారిస్ ఒలింపిక్స్ లో మాత్రమే చోటు.. అప్పటికి టెస్టు క్రికెట్ కూడా ఇంకా బాల్య దశలోనే ఉంది. అప్పటినుంచి ఒలింపిక్స్ లో క్రికెట్ కు ప్రవేశం లేదు. 2028లో అమెరికా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో అయినా ఆడిస్తారనుకుంటే అదీ జరగలేదు.

ఈ ఒలింపక్స్ కు ఎంపిక చేసిన 28 క్రీడాంశాల జాబితాలో క్రికెట్ కు చోటు దక్కలేదు. బాక్సింగ్ , వెయిట్ లిఫ్టింగ్, మోడ్రన్ పెంటాథ్లాన్లకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఒలింపిక్స్ లో క్రికెట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆగస్టు నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరు 2028 ఒలిపిక్స్‌లో తమ అభిమాన ఆట.. జెంటిల్మెన్‌ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌ను చూడొచ్చని ఆశపడ్డారు.

అయితే, ఈసారి కూడా నిరాశే ఎదురయింది. ఒలింపిక్స్‌లోక్రికెట్‌ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలింపిక్‌ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. 2028 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. కానీ, అది నెరవేరలేదు. అయితే, క్రికెట్ కు యువతలో ఉన్న ఆదరణ రీత్యా భవిష్యత్‌లో తప్పకుండా ఒలింపిక్స్‌లో చేర్చవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు గ్రూపు రాజకీయాల కారణంగా బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ కు ప్రాథమి జాబితాలో చోటు దక్కలేదు. ఏదాదిన్నరలో వీటిని పరిష్కరించుకుంటే.. మళ్లీ 2028 ఒలింపిక్స్ లో చోటుదక్కొచ్చు.