Begin typing your search above and press return to search.

పేస్ బుక్ లో అదృశ్యమైన రైతు ఉద్యమ పేజీ .. పేస్ బుక్ ఏంచెప్పిందంటే ?

By:  Tupaki Desk   |   21 Dec 2020 9:50 AM GMT
పేస్ బుక్ లో అదృశ్యమైన రైతు ఉద్యమ పేజీ .. పేస్ బుక్ ఏంచెప్పిందంటే ?
X
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ , ఢిల్లీ సరిహద్దుల్లో చలిని సైతం లెక్కచేయకుండా శాంతియుతంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెనక్కి తగ్గకపోవడం తో రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాల్లో సవరణలకు కేంద్రం ఆలోచిస్తాం అని చెప్తున్నప్పటికీ , అసలు ఆ చట్టాలని పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందే , అప్పటివరకు వెనక్కి తగ్గేదే లేదు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రైతులు తమ నిరసనను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. రైతు సమస్యలపై ఫేస్‌ బుక్‌ లో ఓ పేజీని కిసాన్ సంయుక్త్ మోర్చాకు చెందిన ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ఆ పేజీకి యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 94 లక్షల మందికి రీచ్ కూడా అయ్యింది. ఆదివారం సాయంత్రం లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా పేజీ కనిపించలేదు. దీంతో సంయుక్త్ కిసాన్ మోర్చా ఆందోళనకు గురయ్యింది. అయితే, ఆ తర్వాత కొద్ది సమయంలోనే ఫేస్ బుక్ ‌లో పేజీ కనిపించింది. పేజీ కనిపించడంతో ఊరట కనిపించినా..ఎందుకు తొలగించారని నెటిజన్లు ప్రశ్నించారు. పేజీని కనిపించకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామని ఫేస్ ‌బుక్ యాజమాన్యం తెలిపింది. కానీ, అలా జరగడానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు.

25 మంది ఆన్ లైన్, 35 మంది ఆఫ్ లైన్ వాలంటీర్ల నిరంతరాయంగా పనిచేస్తున్నారు. 24/7 వారు కష్టపడి ఆన్ లైన్ డిస్కషన్స్, రైతుల నిరసనలపై తప్పుడు పోస్టులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ ‌బుక్, ఇన్‌ స్ట్రాగ్రామ్, స్నాప్‌ చాట్, యూ ట్యూబ్ ‌లలో వాస్తవ సమాచారం అందజేస్తున్నారు. ఇవీ ప్రతీరోజు లక్షలాది మంది ప్రజలకు చేరుతోంది.