Begin typing your search above and press return to search.
'రాధే శ్యామ్' పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్...!
By: Tupaki Desk | 22 Aug 2020 3:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ బ్యానర్లు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ సిద్ధం అయినట్లు డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి 'రాధే శ్యామ్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని.. లవ్లీయెస్ట్ డార్లింగ్ ప్రభాస్ తో లాంగెస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు రాధా కృష్ణ ప్రకటించారు.
కాగా లాక్ డౌన్ ముందు జార్జియాలో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చింది 'రాధే శ్యామ్' చిత్రబృందం. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూట్ చేయడం కష్టసాధ్యమని భావించి హైదరాబాద్ లోనే వీలైనంత భాగాన్ని సెట్స్ వేసి చిత్రీకరించనున్నారని సమాచారం. షూటింగ్ ను ఈ ఏడాది నెలాఖరులోగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు తమిళ - మలయాళ - హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి భాగ్యశ్రీ - ప్రియదర్శి - సత్యన్ - సచిన్ ఖేడేకర్ - ఎయిర్టెల్ యాడ్ షాషా ఛత్రి, కునాల్ రాయ్ కపూర్ - మురళి శర్మ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.