Begin typing your search above and press return to search.

మాది త‌ప్పేకాదంటూ చైనా కొత్త మాట‌!

By:  Tupaki Desk   |   19 April 2020 1:47 PM GMT
మాది త‌ప్పేకాదంటూ చైనా కొత్త మాట‌!
X
కోవిడ్-19 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ వైపు ఆందోళ‌న‌కు కార‌ణం అవుతూనే మ‌రోవైపు వివిధ దేశాల మ‌ధ్య ఆరోప‌ణ‌లు - వాదోప‌వాదాల‌కు సైతం వేదిక‌గా మారుతోంది. ఈ వైరస్ బయటపట్ట నగరం పేరిట 'వూహాన్ వైరస్' అని - చైనా వైర‌స్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌.. వుహాన్‌ లోని వైరాల‌జీ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందించిన‌ట్లు అమెరికా పెద్ద ఆరోపించారు. అయితే, దీన్ని చైనా తిప్పికొట్టింది. వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ వైస్‌ డైర‌క్ట‌ర్ యువాన్ జిమింగ్ తాజాగా ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలో రీస‌ర్చ‌ర్‌ గా - వుహాన్ నేష‌న‌ల్ బ‌యోసేఫ్టీ ల్యాబ‌రేట‌రీలో డైరక్ట‌ర్‌ గా ప‌నిచేస్తున్న‌ జిమింగ్ మీడియాతో మాట్లాడుతూ - ఆ వైర‌స్ మా నుంచి రాలేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇది ఎంత మాత్రం మ‌నిషి త‌యారు చేసిన వైర‌స్ కాద‌ని - కేవ‌లం ప్ర‌జ‌ల్ని అయోమ‌యంలో ప‌డేసేందుకు ఈ ప‌న్నాగం వేశార‌న్నారు. వైర‌ల్ స్ట‌డీ జ‌రుగుతున్న‌ప్పుడు - ఇన్ స్టిట్యూట్ లో ఎటువంటి వైర‌స్‌ ను ప‌రీక్షిస్తున్నారు - శ్యాంపిల్స్ ఏ ర‌కంగా ఉంటాయో అంద‌రికీ ముందే తెలుస్తుంద‌న్నారు. త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌రిశోధ‌న‌శాలల్లో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉంటాయ‌ని, రీస‌ర్చ్ నియ‌మావ‌ళి ఉంటుంద‌ని - అందుకే మేం పూర్తి విశ్వాసంతో ఉన్నామ‌న్నారు.

వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ లీకైన‌ట్లు రూమ‌ర్స్ వెనుక త‌మ‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా టార్గెట్ చేసుకోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని జిమింగ్ పేర్కొన్నారు. కొంద‌రు కావాల‌నే ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్నార‌ని అమెరికా ప‌త్రిక‌లు - నేత‌లు అదే ప‌నిచేస్తున్నార‌న్నారని ఆయ‌న ఆరోపించారు. వైర‌స్‌ ను మ‌నిషి త‌యారు చేశారన్న క‌థ‌నాల‌పై స్పందిస్తూ.. అది మాన‌వాతీతం అన్నారు. క‌రోనా వైర‌స్‌ ల‌ను సృష్టించ‌డం అంటే అది బియాండ్ హ్యూమ‌న్ ఇంటెలిజెన్స్ అని యువాన్ అన్నారు. ఇలాంటి టెక్నాల‌జీ కూడా లేద‌న్నారు.