Begin typing your search above and press return to search.

మొన్న ఇళ‌య‌రాజా.. నేడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు.. మోడీకి బీజేపీ నేత‌ల‌తో ప‌నిలేద‌న్న‌మాట!

By:  Tupaki Desk   |   20 April 2022 2:34 PM GMT
మొన్న ఇళ‌య‌రాజా.. నేడు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు.. మోడీకి బీజేపీ నేత‌ల‌తో ప‌నిలేద‌న్న‌మాట!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి త‌మిళ‌నాడులో వీర లెవిల్లో భ‌జ‌న సాగుతోంది. ఆయ‌న ఇంద్రుడ‌ని, చంద్రుడ‌ని.. భారీ ఎత్తున పొగ‌డ్త‌లు, కీర్త‌న‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే.. ఇవేవో.. బీజేపీ నాయ‌కులు.. ఆయ‌న ప‌రివారం చేస్తున్న భ‌జ‌న సంకీర్త‌న‌లు కానేకావు. ఏకంగా స‌నీరంగానికి చెందిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు.. ద‌ర్శ‌కులే.. ప్ర‌ధానిని పోటీ ప‌డి కీర్తిస్తున్నారు. నెత‌ రోజుల కింద‌ట‌.. మోడీ పాల‌న‌ను కీర్తిస్తూ.. ఒక పాట‌లు, ప‌ద్యాల సీడీని రూపొందించారు దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య రాజా. దీంతో ఆయ‌న‌ను ఏకంగా రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేయాల‌ని.. బీజేపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఈయ‌న వ‌రుస‌లో ఇప్పుడు.. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజా కూడా చేరిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారీ ఎత్తున కీర్తించారు. ఆయ‌న‌ను విమర్శించేవారు పరిపక్వత లేనివారై ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దర్శకుడు భాగ్యరాజ్. చెన్నై, త్యాగరాయనగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తాజాగా 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్ ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు. క‌రోనా స‌మ‌యంలో ఈ దేశం ఒణికిపోయిన‌ప్పుడు.. ప్ర‌ధానిగా ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు దేశాన్ని నిల‌బెట్టాయ‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. పేద‌ల‌కు అన్ని రూపాల్లోనూ అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టార‌ని.. క‌రోనా స‌మ‌యంలో పేద‌లు ఆక‌లితో చ‌నిపోకుండా.. గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న‌యోజ‌న‌ను అమల చేశారని కీర్తించారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసేది నెల తక్కువ వారేనని భాగ్య‌రాజా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స‌మాజంలో వీరిని ప్ర‌జ‌లు చీడ‌పురుగుల్లా భావిస్తున్నార‌ని.. ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

``నేను బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఐపీఎస్ అధికారి అన్నామలై(ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు)పై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు బీజేపీ నాయకుడిగా సరైన వ్యక్తిని నియమించారని చెప్పారు. కొందరు విమర్శకులు సరైన రీతిలో మాట్లాడరు, ఎదుటివారు చెప్పేది వినరు.

అలాంటి విమర్శకులు తమను తాము పరిపక్వత లేనివారుగా భావించాలి. ఇలాంటివారంతా నెల త‌క్కువ‌గా పుట్టిన‌వారేన‌ని నా అభిప్రాయం`` అని భాగ్య‌రాజ్ వ్యాఖ్యానించారు. దీంతో అక్క‌డున్న వారు చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగించినా.. బ‌య‌ట మాత్రం ఇంత భ‌జ‌న దేనికో.. అంటూ.. పెద‌వి విరిచారు. మ‌రి బీజేపీని తీవ్రంగా వ్య‌తిరేకించే అధికార డీఎంకే నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.