Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఫ్లైటెక్కి డైరెక్ట్ గానే బీజేపీతో ...?
By: Tupaki Desk | 19 Feb 2023 10:00 PM GMTఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు రోజు రోజుకూ దగ్గర పడుతోంది. ఇప్పటి నుంచే సర్దుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇంకా కష్టపడాలి. అందుకే తెలుగుదేశం ఈ విషయంలో స్పష్టంగా ఉంది అని అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తులకు సూత్రప్రాయంగా ఓకే చెబుతున్న తెలుగుదేశం బీజేపీ విషయంలో కూడా తమతోనే ఉండేలా చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది అని అంటున్నారు.
బీజేపీ వరకూ చూస్తే ఏపీ నేతలు కొందరు తెలుగుదేశంతో పొత్తుకు నో అంటున్నారు. అయితే కేంద్ర నాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయన్న దాని మీద అయితే స్పష్టత లేదు. 2019 నాటి వైరాన్ని కేంద్ర పెద్దలు కొనసాగిస్తారు అని అంటున్నా రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. కాదు అన్న చోట అవును అనిపించేదే రాజకీయం అన్న వారూ ఉన్నారు.
ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో అమిత్ షా ఎన్డీయేలోకి తెలుగుదేశాన్ని మళ్ళీ చేర్చుకునేది లేదు అని చెప్పారు. కానీ అలా వీలు అవుతుందా అన్నదే చర్చ. ఎందుకంటే తెలంగాణాతో పాటు ఏపీలో బీజేపీ పుంజుకోవాలి. కర్నాటకలో మరోసారి బీజేపీ గెలవార్లి. సౌత్ లో బలపడాలి. ఇలా చేయాలీ అంటే బీజేపీకి మిత్రులు కావాలి. మోడీ అమిత్ షాల ఏలుబడిలో బీజేపీకి మిత్రులు తగ్గిపోయారు. అలాంటి పరిస్థితుల్లో తాను మిత్రుడిని అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న వేళ కాదు అని ఎవరూ అనుకోరని అంటున్నారు.
పైగా తెలంగాణాలో పది నుంచి పదిహేను సీట్లలో తెలుగుదేశానికి బలం ఉంది. పొత్తులు కుదిరితే కనుక ఆ సీట్లలో బీజేపీకి రాజకీయంగా మేలు జరుగుతుంది. ఇక కర్నాటకలో కూడా కొన్ని సీట్లలో తెలుగుదేశానికి మద్దతుదారులు ఉన్నారని వారిని కూడా బీజేపీకి టర్న్ చేస్తామని తెలుగుదేశం చెప్పబోతోంది.
ఇక తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని అంటున్నారు. ఈ ఏడాది జూన్, జూలై ల మధ్యలో అసెంబ్లీ రద్దు అవుతుందిట. అంటే నవంబర్ లో ఎన్నికలు ఖాయమని అంటున్నారు. అదే విధంగా జూలైలో కర్నాటకలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో పొత్తుల కధను కొలిక్కి తీసుకురావాలని బీజేపీ కూడా భావిస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే చంద్రబాబు మార్చి నెలాఖరున కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఢిల్లీకి వెళ్తారని, బీజేపీతో పొత్తుల విషయం మీద డైరెక్ట్ గా మోడీ అమిత్ షాలలతో మాట్లాడుతారు అని అంటున్నారు. కేంద్ర పెద్దలు కూడా తెలుగుదేశంతో పొత్తుల విషయంలో సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో చూస్తే తెలుగుదేశంతో పొత్తును ఎక్కువ మంది నేతలు కోరుకుంటున్నారు. ఇక తెలంగాణాలో గెలుపు కోసం బీజేపీ చూస్తోంది.
అందువల్లనే బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వవచ్చు అని అంటున్నారు ఈ లోగా తెలుగుదేశానికి ఏపీ, తెలంగాణాలలతో పాటు కర్నాటకలో కొన్ని చోట్ల బలం ఏమేరకు ఉందని ఒక సర్వేను బీజేపీ చేపడుతుందని, దాని మీదటనే బాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు ఉంటుందని అంటున్నారు. నిజానికి చూస్తే గత ఏడాది నుంచే బీజేపీ పెద్దలు బాబుతో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి చంద్రబాబుని పిలిచారు.
మోడీ కూడా ఆ సందర్భంగా కొంతసేపు మాట్లాడారు. ఇంకోవైపు చూస్తే ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ కేంద్ర పెద్దల వైఖరి మారుతోందని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ తరువాత నుంచి బీజేపీ అసలు రాజకీయం మొదలవుతుంది అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే తెలుగుదేశంతో పొత్తు ద్వారా తెలంగాణాలో అధికారంతో పాటు ఏపీలో తమ పాత్రను మెరుగుపరచుకోవడం, కర్నాటకలో కూడా మళ్లీ పాగా వేయడం అన్న లక్ష్యాలు బీజేపీకి ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో తెలుగుదేశానికి పెరుగుతున్న ఆదరణ కూడా ఢిల్లీ పెద్దల ఆలోచనలలో మార్పు తీసుకుని వస్తోందని అంటున్నారు. ఈసారి బాబు ఢిల్లె ఫ్లైట్ ఎక్కితే మాత్రం ఏపీ పాలిటిక్స్ టోటల్ గా షేకవడం ఖాయమని అంటున్నరు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.