Begin typing your search above and press return to search.

ఆ కెనడా మంత్రి.. తెలుగమ్మాయే

By:  Tupaki Desk   |   11 Dec 2015 8:24 AM GMT
ఆ కెనడా మంత్రి.. తెలుగమ్మాయే
X
దేశం కాని దేశంలో.. అది కూడా తెలుగమ్మాయ్ మంత్రి కావటం విశేషమే. అలాంటి ప్రత్యేక దీపికా దామెర్ల ప్రత్యేకత. కెనడా దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఒంటారియోలో ఆమె మంత్రి అయ్యారు. సికింద్రాబాద్ లో పుట్టిన దీపికా తర్వాత కాలంలో కెనడాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా.. తాను పుట్టిన జన్మభూమిని మర్చిపోని వారికి మాదిరే.. దీపికా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి పెడుతోంది.

కెనడా రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న దీపికా.. ఆ రాష్ట్ర ప్రధాని కైత్లాని వైనేను ఒప్పించి.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు ఓకే చెప్పించారు. ఆమె అనుకున్నట్లు సాగితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె.. తనతో పాటు.. కెనడాలోని ఒంటారియా రాష్ట్ర ప్రధానమంత్రిని పర్యటనకు తీసుకురానున్నారు. గత ఎన్నికల్లో లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీపిక మంత్రి అయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవాలన్నదే దీపిక లక్ష్యం. ఫిబ్రవరిలో దేశానికి రానున్న ఈ బృందం.. హైదరాబాద్ తో పాటు.. ఏపీలోని అమరావతిలో కూడా పర్యటించనున్నారు. మరి.. రెండు తెలుగు రాష్ట్రాలతో ఒంటారియా రాష్ట్రం ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారో చూడాలి. ఓ పక్క పుట్టిన ప్రాంతం పట్ల మమకారం.. మరోపక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి లబ్థి చేకూరేలా ప్రయత్నిస్తున్న దీపిక ప్రయత్నం ఫలించాలని.. రెండు ప్రాంతాల అభివృద్ధికి ఆమె వారధి కావాలని కోరుకుందాం.