Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: మోడీతో సీత.. ఎవరీవిడ?

By:  Tupaki Desk   |   17 April 2020 2:00 PM GMT
వైరల్ పిక్: మోడీతో సీత.. ఎవరీవిడ?
X
ప్రధాని మోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తి. ప్రపంచాధినేతలను సైతం ప్రభావితం చేయగల నేర్పరి. అంతటి ప్రధాని గురించి ఏ వార్త తెలిసినా అందరూ చెవులు నిక్కబొడుచుకుని వింటారు. ఇప్పుడు అలాంటి మోడీతో ఓ సీత ఉంది.ఆ వైరల్ ఫొటో హాట్ టాపిక్ గా మారింది.

1987లో దూరదర్శన్ లో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్ లో సీతగా నటించిన దీపిక చిఖాలియా దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తాజాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 32 ఏళ్ల తర్వాత ఆ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ప్రసారం చేస్తోంది.

ఈ సీరియల్ లో సీతగా నటించిన దీపికా చిఖాలియా ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆమె పక్కనే ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉండడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ ఫొటోను షేర్ చేసిన దీపికా చిఖాలియా దాని గురించి వివరించింది. అప్పట్లో సీతగా వచ్చిన పాపులారిటీతో 1991లో బరోడా నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై దీపిక పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఆ సమయంలో అప్పటి మాజీ ఉప ప్రధాని అద్వానీ - నరేంద్రమోడీతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంది. నాటి ఫొటోనే ఇప్పుడు షేర్ చేసింది. మోడీతో అనుబంధాన్ని పంచుకుంది. పక్కపక్కనే కూర్చున్న వీరి ఫొటో వైరల్ గా మారింది.