Begin typing your search above and press return to search.

ప‌ళ‌ని కొంప కొల్లేరేనా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 9:59 AM GMT
ప‌ళ‌ని కొంప కొల్లేరేనా?
X
ఏ ముహూర్తాన త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు ప‌క్క‌దారి ప‌ట్టాయో కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు లైన్‌ లోకి రాలేదు. అటు కేంద్రం - ఇటు రాష్ట్రంలోని పార్టీలు మూకుమ్మ‌డిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. రాష్ట్రం రాజ‌కీయంగా ర‌గులుతూనే ఉంది. అన్నాడీఎంకేలో అసంతృప్తి సెగ‌లు ఓపీఎస్‌ తో చేతులు క‌ల‌ప‌డం ద్వారా త‌గ్గించాల‌ని ఈపీఎస్ నిర్ణ‌యించి.. నాలుగు మెట్లు దిగొచ్చి ఒప్పందం చేసుకుని ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. త‌న పాల‌న‌పై దృష్టి పెట్టాల‌ని అనుకునేంత‌లో అన్నాడీఎంకే బ‌హిష్కృత కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్ రెచ్చిపోతున్నాడు. ఈపీఎస్‌ - ఓపీఎస్‌ ల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాడు. ఈపీఎస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి తీర‌తాన‌ని చేసిన ప్ర‌తిజ్ఞ‌ను నెర‌వేర్చుకునే ప‌నిలోనే ఉన్నాడు.

దీంతో రాజ‌కీయంగా అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొనే ఈపీఎస్‌ - ఓపీఎస్‌ లు సైతం ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఈ సీఎంపై మాకు న‌మ్మ‌కంలేదంటూ.. గ‌వ‌ర్న‌ర్‌ ను క‌లిశారంటే. ప‌రిస్థితి ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్ధం అవుతుంది. ఇక‌, ఇప్పుడు ఈ సంఖ్య మ‌రింత పెరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దిన‌క‌రన్‌ వర్గం పేర్కొంది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా వెల్ల‌డించాడు దిన‌క‌ర‌న్‌. నిన్న కుంభకోణంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు.

పళని ప్రభుత్వాన్ని కూల్చి.. అసెంబ్లీ స్పీకర్‌ పీ ధనపాల్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోలేరని, ఆయన ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. పన్నీర్‌ సెల్వంతో ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ప్రమాణం చేయించడం తప్పుడు చర్య అని దివాకరన్‌ మండిపడ్డారు. తమిళనాడులో అస్థిర ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. దీంతో ప‌రిస్థితి ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. కేవ‌ల 40 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని కూల్చ‌వ‌చ్చేమోకానీ - కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు. అయితే, మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.