Begin typing your search above and press return to search.

దిల్ సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్లు:నరరూప రాక్షసుల నెత్తుటి దాహం

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:10 AM GMT
దిల్ సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్లు:నరరూప రాక్షసుల నెత్తుటి దాహం
X
నేటికి దిల్ సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్లు జ‌రిగి ఐదు సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. పూర్తిగా చీక‌టి ప‌డ‌క ముందే ఆ ప్రాంతం మార‌ణ‌హోమంలా మారింది. రెప్ప‌పాటులో సంభ‌వించిన పేలుళ్లుధాటికి ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 19మంది ప్రాణాలు విడిచారు. బాంబు అవ‌శేషాలు త‌గిలి వంద‌ల మంది గాయ‌ప‌డ్డారు. ఎవరు చేశారో ఏం చేశారో అని ఊహించే లోపే రంగంలోకి దిగిన పోలీసులు ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేశారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిల్ సుఖ్ న‌గ‌ర్ లో ద‌డ పుట్టించిన ఘ‌ట‌న ఇప్ప‌టికీ హైద‌రాబాద్ వాసుల్ని వెంటాడుతూనే ఉంది. ఈ బాంబుదాడికి ఇండియ‌న్ ముజాహిదీన్ కీల‌క నేత యాసిన్ భ‌త్క‌ల్ కీలపాత్ర పోషించాడు.

అది 2013ఫిబ్ర‌వ‌రి 7గంట‌ల స‌మ‌యం దాటుతోంది. హైద‌రాబాద్ దిల్ సుఖ్ న‌గ‌ర్ కోణార్క్ థియేట‌ర్ ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు ర‌ద్దీగా ఉన్నారు. ఎవ‌రి ప‌నుల్లో వారు ఉన్న స‌మ‌యంలోనే వెంట‌వెంట‌నే జంట‌పేలుళ్లు జ‌రిగాయి. వాళ్ల‌లో కొంత‌మంది ఏం జ‌రిగింద‌ని తెలుసుకునే లోపే ఆ ప్రాంత‌మంతా ర‌క్త‌పు మ‌డుగుతో చేతులు కాళ్లు తెగి విరిగిప‌డిన వారి ఆహాకారాలు ఆర్త‌నాదాలతో భీతిల్లిపోయింది. కొద్ది వ్య‌వ‌ధిలోనే రెండు చోట్ల బాంబులు పేలాయి. 19మంది మృత్యువాత ప‌డ్డారు. 120మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో హైద‌రాబాద్ ఉలిక్కిప‌డింది. రాష్ట్ర‌పోలీసులు - జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ రంగంలోకి దిగి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. ఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన ఆధారాలు - సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితుల‌ను గుర్తించిన ఎన్ ఐఏ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసులో సంబంధించి దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేసి కేసు మిస్ట‌రీని చేధించారు. కోర్టులో కూడా విచార‌ణ పూర్తికావ‌డంతో 2016,డిసెంబ‌ర్ 19న ఐదుగురు దోషుల్ని నేర‌స్తులుగా నిర్ధారించిన న్యాయ‌స్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్ష‌ప‌డిన వారిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన అస‌దుల్లా అక్త‌ర్ అలియాస్ హ‌డ్డీ - పాకిస్తాన్ కు చెందిన జియా ఉర్ రహ్మ‌న్ అలియాస్ వాఖ‌స్ - బీహార్ కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ తాసీర్ అక్త‌ర్ - క‌ర్నాట‌క‌కు చెందిన మ‌హమ్మ‌ద్ అహ్మ‌ద్ సిదిబాప అలియాస్ యాసిన్ బ‌త్క‌ల్ - మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎజాజ్ స‌యూద్ షేక్ ఉన్నారు. అలాంటి చీక‌టి రోజు రానే వ‌చ్చింది. న‌గ‌ర వాసుల్ని ప్రాణ‌భ‌యంతో వ‌ణికి పోయేలా చేసిన జంట‌పేలుళ్లు జ‌రిగి స‌రిగ్గా ఇవ్వాల్టికి ఐదేళ్లు కావొస్తుంది. ఫిబ్ర‌వ‌రి 21 వ‌చ్చిందంటే చాలు జంట‌పేలుళ్ల ఘ‌ట‌న గుర్తు చేసుకుంటూ ఆరోజు జ‌రిగిన ప‌రిస్ధితి ద్రిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు ఈ ప‌రిస‌ర ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. బందోబ‌స్తు కూడా పెంచారు.

అయితే ఇంత‌టి న‌ర‌మేధం సృష్టించిన టెర్ర‌రిస్టుల్లో యాసిన్ భత్కల్ భ‌యంక‌ర‌మైన టెర్ర‌రిస్ట్. మోటివేటర్ - రిక్రూటర్ - లాజిస్టిక్ ప్రొవైడర్ - బాంబు మేకర్ - లీడర్.. ఇదీ యాసిన్ భత్కల్ గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పేంది.

1983 జ‌న‌వ‌రి 15న క‌ర్నాట‌క‌ - కోస్ట‌ల్ న‌గ‌రం భ‌త్క‌ల్ లో యాసిన్ భ‌త్క‌ల్ లో జ‌న్మించాడు. సేల్స్ మ్యాన్ నుంచి ఇండియన్ ముజాహిదీన్ కీల‌క నేత‌గా ఎదిగాడు.

యాసిన్ భ‌త్క‌ల్ తండ్రి దుబాయ్ లో బ‌ట్ట‌ల వ్యాపారి . వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉన్న ఇత‌డు ఉగ్ర‌వాదిగా మారాడు. దీంతో త‌న తీరును తండ్రి గుర్తించ‌డంతో దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వ‌చ్చాడు.

ఇండియాకి వ‌చ్చిన త‌రువాత త‌న ద‌గ్గ‌ర బంధువులైన రియాజ్ భ‌త్క‌ల్ - ఇక్బాల్ భ‌త్క‌ల్ లు స్థాపించిన ఇండియ‌న్ ముజాహిదీన్ (ఐఎం) కోసం ప‌నిచేస్తూ షారుక్ ఖాన్ - శివానంద్ - డాక్టర్ ఇమ్రాన్ అంటూ మారుపేర్ల‌తో ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఐఎం కోసం నిధులు సేక‌రించేవాడు. అలా మొద‌లైన భ‌త్క‌ల్ జీవితం బాంబు త‌యారు చేసే స్పెషలిస్ట్ గా ఎదిగాడు. ఏదైనా ప్రాంతాన్ని బాంబులతో పేల్చాలంటే తాను త‌యారు చేసిన బాంబుల్ని ప్ర‌యోగించేవాడు. వ‌రుస‌దాడుల‌కు పాల్ప‌డేవాడు. అలా భ‌త్క‌ల్ వ‌రుస‌గా బాంబుల్ని త‌యారు చేసి నిష్ణాతుడుగా కావ‌డంతో త‌న తోటి స‌హ‌చ‌రుల‌కు మెంటార్ గా ఎదిగాడు.

ఈ నేప‌థ్యంలో భార‌త అంత‌ర్జాతీయ నిఘూ సంస్థ‌లు ఉగ్ర‌వాదుల్ని వేటాడే ప‌నిలో ప‌డింది . ఈ విష‌యం తెలుసుకున్న ఇండియాన్ ముజాహిదీన్ నేత‌లు రియాజ్ - ఇక్బాల్ - అబ్దుస్ సుహాన్ లు వంటి భార‌త్ ను వదిలి పాకిస్తాన్‌ లో షెల్టర్ తీసుకున్నారు.

దీంతో ఐఎం అంత‌రించి పోయింద‌ని అంద‌రు అనుకున్నారు. నిఘూ సంస్థ‌ల‌కు భ‌త్క‌ల్ గురించి తెలియ‌క‌పోవ‌డంతో ఐఎం కు ప్రాణం పోసేందుకు వ్యూహాలు ర‌చ‌యించేవాడు. తన సహచరులు వకాస్ - అసదుల్లా అక్తర్ - తహసీన్ అక్తర్ - అజాజ్ షేక్ తదితరులతో కలిసి పునరుజ్జీవం పోశాడు. అన్నీ దాడుల్లో త‌నదైన పాత్ర ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకునే వాడు. అలా 2006లో ముంబైలో 13/7 ట్రెయిన్ బ్లాస్టు - 2010లో ఢిల్లీ బ్లాస్ట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పేలుడు - 2010లో పుణేలో జర్మన్ బేకరీ పేలుడు - 2011లో ఢిల్లీ హైకోర్టు పేలుడు - ముంబై వరుస పేలుళ్లు - 2013లో దిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు కుట్ర చేశాడు.

ఈ క్ర‌మంలో త‌న మెంటార్ రియాజ్ భ‌త్క‌ల్ ను యాసిన్ భ‌త్క‌ల్ ను విభేదించేవాడు. తాను చేస్తున్న కార్య‌క‌లాపాల గురించి ఐఎస్ ఐకి రిపోర్ట్ చేయాల‌ని రియాజ్ భ‌త్క‌ల్ ప‌ట్ట‌బ‌డ‌డంతో ..ఐఎస్ ఐకి సిద్ధాంతం లేద‌ని భావించేవాడు. అంతేకాదు రియాజ్ భ‌త్క‌ల్ పాకిస్తాన్ లో ఎంజాయ్ చేస్తుంటే తాను ఇలా రోడ్ల వెంట ఎందుకు తిర‌గాలి అని ప్ర‌శ్నించేవాడు. అలా వారిద్ద‌రి మ‌ధ్య పొర‌పొచ్చ‌లొచ్చాయి.

దీంతో ఇండియన్ ముజాహిదీన్ లో విభేదాలు త‌లెత్తడంతో ప‌రిష్క‌రించుకుందామ‌ని రియాజ్ భ‌త్క‌ల్ - యాసిన్ భ‌త్క‌ల్ ను పాకిస్తాన్ కు ఆహ్వానించాడు. రియాజ్ ఆహ్వానం మేర‌కు చివ‌రిసారిగా త‌న భార్య‌తో మాట్లాడిన యాసిన్ భ‌త్క‌ల్ ను దిల్ సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్ల నిందితుల్ని వేటాడుతున్న ఇండియ‌న్ ఇంటెలిజ‌న్స్ బ్యూరో అధికారులు అతను నేపాల్ మీదుగా పాకిస్తాన్ వెళ్తుండగా అరెస్టు చేశారు.

అరెస్ట్ చేసిన నిందితుల్ని ఎన్ ఐ ఏ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. దాదాపు మూడున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం 157 మంది సాక్షుల వాంగ్మూలం - 501 పత్రాలు - 73 వస్తు సాక్షాలను ఎన్ ఐఎ కోర్టుకు సమర్పించింది. ఈ అంశాలను అన్నింటినీ పరిగణన లోనికి తీసుకున్న కోర్టు నిందితులకు మరణ శిక్షను విధించింది.

పాకిస్తాన్ కు చెందిన వకాస్ పై విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 - 2 అఫ్ 3 కింద నేరం నిరూపణ అయింది. నిందితులైన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి - తెహసీన్ అక్తర్ అలియాస్ మోనూ - జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ - యాసిన్ భత్కల్ - ఐజాక్ షేక్ లను నేరస్తులుగా నిర్ధారించి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది.