Begin typing your search above and press return to search.
బీజేపీలోకి దిల్ రాజు..!
By: Tupaki Desk | 22 Oct 2019 8:42 AM GMTటాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత దిల్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నారు. తెలుగులో అగ్ర నిర్మాతగా... టాప్ డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తున్న కీలక వ్యక్తులో ఒకరిగా ఉన్న రాజు ఇప్పుడు జెర్సీ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక తొలి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండే దిల్ రాజు గత కొద్ది రోజులుగా రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ఆయన అధికార టీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఆ ప్రచారం సైలెంట్ అయింది.
ఎన్నికల తర్వాత రాజు కేసీఆర్ రికమెండేషన్ తో ప్రముఖ దేవస్థానం అయిన టీటీడీ బోర్డు మెంబర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రాజుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి రావడమే ఆలస్యం అనుకున్నారు. అయితే చివర్లో క్యాస్ట్ ఈక్వేషన్లతోనే ఆయనకు ఆ పదవి రాలేదన్న టాక్ బయటకు వచ్చింది. ఇక తాజాగా రాజు ప్రధానమంత్రి మోడీని కలిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ వార్తలు వస్తున్నాయి.
ఇటీవల మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ.. సినీ సెలబ్రిటీలకు ఓ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందుకు సౌత్ నుంచి ఏ సినిమా స్టార్‌ను కూడా పిలవలేదు. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఒక్క దిల్ రాజుకు మాత్రమే ఆహ్వానం అందింది. తాను మోదీని కలిసిన విషయాన్ని దిల్ రాజు తన సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ‘‘మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో వస్తోన్న మార్పుల గురించి మీతో చర్చించడం చాలా సంతోషం’’ అంటూ దిల్ రాజు కామెంట్ పెట్టారు.
అయితే కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి తెలుగు సినిమా రంగంలో ఉన్న పెద్ద తలకాయలతోపాటు.... బడా నిర్మాతలకు గాలం వేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఒక కేంద్ర మంత్రి మరో అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ ను ఆయన కార్యాలయంలోనే కలిసిన సంగతి తెలిసిందే. ఇక మరో కేంద్రమంత్రి సైతం ఇటీవల దిల్ రాజ్ ను కలిసి బిజెపిలోకి రావాలని ఆహ్వానించారనే టాక్ ఉంది.
తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని కూడా కొందరు అగ్ర నిర్మాతలకు బిజెపి అధిష్టానం హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వచ్చేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్న రాజు ఈ ఛాన్స్ ఉపయోగించుకొని కాషాయ కండువా కప్పుకుంటారా ? మరి ఆయన మనసులో ఏముందో ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేయి చూడాలి.