Begin typing your search above and press return to search.
డిగ్గీ రాజాకు చీర్ లీడర్స్ కావాలట
By: Tupaki Desk | 27 March 2017 11:12 AM GMTలేటు వయసులోనూ ఘాటు ప్రేమలో పడడమే కాకుండా ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ల్లో చీర్ లీడర్స్ ఉంటారో ఉండరో అని ఆందోళన చెందుతున్నారట. ప్రస్తుత మధ్య ప్రదేశ్ సీఎం చీర్ లీడర్సుకు అనుమతి ఇస్తారో ఇవ్వరో అని ఆయన కంగారు పడుతున్నారట. ఒకవేళ చీర్ లీడర్స్ లేకుంటే ఐపీఎల్ మ్యాచ్ లకు ఆయన వెళ్లేలా కూడా లేరు.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో మూడు మ్యాచులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగన్నాయి. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ జరిగే మూడు మ్యాచ్ లకు వినోద పన్ను మినహాయింపును ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో దిగ్విజయ్ సింగ్ ఆయనకు చురకలంటించారు. క్రీజులో బ్యాట్స్ మెన్ సిక్సులు, ఫోర్లు కొట్టే సమయంలో చీర్ లీడర్స్ వేసే డ్యాన్స్ లు అభిమానులను అలరిస్తాయని.. కానీ మ్యాచులో చీర్ లీడర్లు ఉండడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టముండదని దిగ్విజయ్ అన్నారు.
అందుకే ఐపీఎల్ మ్యాచులకు పన్ను మినహాయింపును ఇవ్వడం లేదని, అయితే చీర్ లీడర్లకు బదులు రాముడి పాటలు వేస్తే మాత్రం ఆయన పన్ను మినహాయింపు ఇచ్చేవారని సెటైర్ వేశారు. మొత్తానికి ఈ రొమాంటిక్ వృద్ధనేతకు చీర్ లీడర్స్ బాగానే నచ్చినట్లున్నారు.