Begin typing your search above and press return to search.

ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టుకు వెళతారంట

By:  Tupaki Desk   |   28 Jun 2015 9:51 AM GMT
ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టుకు వెళతారంట
X
విభజనకు ముందు ప్రాంతాల వారీగా కొట్టుకు చచ్చిన కాంగ్రెస్‌ నేతలు. .తాజాగా ఉమ్మడి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వానికి సన్నిహితుడైన దిగ్విజయ్‌ సింగ్‌ నేతృత్వంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డిగ్గీరాజా పలు విషయాల్ని వెల్లడించారు.

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ.. ఏపీ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తారని ప్రకటించారు. ఈ కేసును సీబీఐ చేపట్టాలని.. ఒకవేళ అలా కాని పక్షంలో తమ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయిస్తారని చెప్పారు. ఓటుకు నోటు వ్యవారంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము ఎక్కడా పాల్పడలేదని చంద్రబాబునాయుడు ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

ఇక.. రెండు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న సెక్షన్‌ 8 వివాదానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి సమస్యలు వస్తాయన్న ఉద్దేశ్యంతోనే తాము సెక్షన్‌ 8ను పెట్టామని.. చట్టంలో ఉన్న వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సెక్షన్‌ 8కి సంబంధించి ఎవరికి వారు.. వారికి అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని.. అలా కాకుండా న్యాయవ్యవస్థ ఈ అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.