Begin typing your search above and press return to search.
అబ్బో.. మీరు ఇలాంటి మాటలూ చెబుతారా డిగ్గీ
By: Tupaki Desk | 13 April 2016 10:24 AM ISTకొందరికి కొన్ని మాటలు అస్సలు సూట్ కావు. రాజకీయాల్లో విలువల గురించి.. కట్టుబాట్ల గురించి కాంగ్రెస్ నేతలు చెబితే చిత్రంగా ఉంటుంది. అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ ఇప్పటికి ఎన్ని తప్పులు చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దేశ రాజకీయాల్లో వికృత ధోరణులన్నింటికి ఆ పార్టీనే తొలుత బీజం వేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. తమ అధికారాన్ని నిలుపుకోవటం కోసం పార్టీలను తీల్చటం.. చాటుగా దెబ్బ తీయటం లాంటివెన్నో.
మిగిలిన విషయాలన్నీ పక్కన పెడదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపక్షాలు అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ సంగతే చూద్దాం. దీన్ని మొదలెట్టింది ఎవరు..? కాంగ్రెస్ దివంగత మహా నేతగా అభివర్ణించే వైఎస్ రాజశేఖర్ రెడ్డే కదా. సంపూర్ణ మెజార్టీ ఉన్నా.. సంతృప్తి చెందకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని దెబ్బ తీయాలని.. వాటి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాలన్న ఉద్దేశంతో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేశారు. అదిప్పుడు కాంగ్రెస్ కొంపనే ముంచుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేసి పలు పార్టీ నేతల్ని తన పార్టీలోకి తీసుకెళ్లటం తెలిసిందే. నాయకత్వ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు.. వాస్తవ పరిస్థితుల్ని చూసుకొని కారు ఎక్కేయటం తెలిసిందే. ఇలా వెళ్లిపోయిన నేతలకు పార్టీలోకి తిరిగి రానివ్వమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి.. తెలంగాణ రాష్ట్ర పార్టీ పరిశీలకుడైన దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజా చెప్పుకొచ్చారు.
పార్టీ నుంచి వీడిపోయిన వారిని తిరిగి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. పలు ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ను విడిచి వెళుతున్న వారు అధికారపార్టీలో చేరుతున్నారని.. స్వార్థం కోసం వెళుతున్న వారు తిరిగి వస్తానన్నా ఆహ్వానించకూడదని వ్యాఖ్యానించారు. ఈ తరహా మాటలు ఇప్పటికి ఓకే అయినా.. ఇదే మాట మీద భవిష్యత్తులో నిలబడతారా? అన్న ప్రశ్నకు డిగ్గీ రాజా గుండె మీద చేయి వేసుకని చెప్పగలరా? అంత ధైర్యం డిగ్గీకి కానీ కాంగ్రెస్ కు కానీ ఉందా..?