Begin typing your search above and press return to search.

లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   7 May 2019 10:35 AM GMT
లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేశారంటే..
X
ఎన్నికల్లో గెలవాలంటే అందరూ ఏం చేస్తారు.. గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తారు.. సమాజ సేవ కార్యక్రమాలు చేస్తారు. కార్యకర్తలు, నాయకులను సమన్వయ పరిచి ప్రచారంలో దూసుకెళ్తారు. చేతికి ఎముకలేనట్టు కుల, మహిళ, విద్యార్థి సంఘాలకు తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. పోలింగ్ ముందర డబ్బు - మద్యం పంచుతారు.. గెలవడానికి చేసే పనులు ఇవే.. కానీ ఇక్కడో కాంగ్రెస్ నాయకుడు కొత్తగా ఆలోచించాడు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఆయన తాజాగా అఘెరాలతో హఠపూజలు చేయించారు.

ఈసారి మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి కేంద్రమాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారు. కాకలు తీరిన ఈ కాంగ్రెస్ యోధుడిపై బీజేపీ గట్టి ప్రత్యర్థిని పెట్టింది. మాలేగావ్ బాంబు పేలుళ్లలో 8ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన సాధ్వి ప్రగ్యాసింగ్ ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టింది. ఆమెకు హిందువుల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉండడం దిగ్విజయ్ లో కంగారు మొదలైంది.

దీంతో డిగ్గీ రాజా తన గెలుపు బాధ్యతను సాధువులకు అప్పగించాడు. శాంతి హోమాలు జరిపించారు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాధువు కంప్యూటర్ బాబా భోపాల్ లో కొంతకాలంగా హఠయోగ శిక్షణ శిభిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో దేశవ్యాప్తంగా హఠయోగులు - అఘెరాలు హాజరవుతుంటారు. ఈ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన దిగ్విజయ్ సింగ్ తన భార్యతో కలిసి మంగళవారం హఠయోగులు - అఘెరాలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

ఇలా డిగ్గీరాజా తన గెలుపు కోసం సాధువులను కలవడం.. హోమాలు నిర్వహించడం.. గెలుపు కోసం తండ్లాట పడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ భోపాల్ నియోజకవర్గంలో గెలుపు కోసం ఇలా అన్ని ప్రయత్నాలను దిగ్విజయ్ చేస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.