Begin typing your search above and press return to search.

జగన్ ను కలిసిపోమ్మంటున్నారు....

By:  Tupaki Desk   |   8 April 2015 5:02 AM GMT
జగన్ ను కలిసిపోమ్మంటున్నారు....
X
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. పొట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను తమలో కలిసిపోవాలని గాంధీల నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సదరు పార్టీ విలీనం ఆవశ్యకతను వివరించారు.

మతోన్మాదం, ఫాసిస్టు శక్తులపై పోరాడేందుకు ఒకప్పటి కాంగ్రెస్ శక్తులన్నీ ఐక్యం కావాల్సి ఉందన్నారు డిగ్గీ రాజా. కాంగ్రెస్ నుంచి వివిధ సందర్భాల్లో బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టుకున్న వారంతా తిరిగి రావాలని, ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ లో ఏకీకృతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతల పార్టీలైన ఎన్సీపీ(శరద్ పవార్), తృణమూల్ కాంగ్రెస్(మమతా బెనర్జీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైఎస్ జగన్), తమిళ మానిల కాంగ్రెస్(జీకే వాసన్) లు కాంగ్రెస్ లో విలీనం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఢిగ్గీ రాజా ఆహ్వానం బాగానే ఉన్నా...కొన ఊపిరితో, నాయకత్వంపై విపరీతమైన అస్పష్టతతో ఉన్న కాంగ్రెస్్ వైపు ఏ పార్టీ అయినా లేదా వారి నాయకత్వం అయినా ఎందుకు వెళుతుంది? ఆ పార్టీ ప్రాభవం రాను రాను గోడకు వేసిన సున్నం వలే వెలిసిపోవడం తప్ప మెరుగుపడటం లేదు. పాలకులను ఢీకొట్టగల సరైన దార్శనికతతో అడుగులు వేయలేని స్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతీయ పార్టీలు ఎందుకు గౌరవిస్తాయి. ఉన్నదో లేనిదో చూసుకుంటూ తమ రాష్ర్టంలోనే షో నడిపిస్తుంటాయి తప్ప.