Begin typing your search above and press return to search.
బిజినెస్ ల కోసమే పార్టీ మారిపోతున్నారు
By: Tupaki Desk | 16 Jun 2016 5:07 AM GMTఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలంగాణలోని తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చుక్కలు చూపించి.. ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా తన ఫోకస్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ గుత్తాతోపాటు.. వివేక్.. వినోద్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని కారు ఎక్కించిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం నేత డిగ్గీ రాజాతో పాటు అధిష్ఠాన దూతలు కుంతియా.. కొప్పుల రాజులు కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ అధికారపక్షానికి తామే అసలుసిసలు ప్రతిపక్షంగా చెప్పుకున్న డిగ్గీ.. తెలంగాణలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కనుమరుగైనట్లు ప్రకటించారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారంతా నిజమైన కాంగ్రెస్ నేతలు ఎంతమాత్రం కాదని.. వారంతా తమ వ్యాపారాల కోసం రాజకీయాల్ని ఉపయోగించుకునేవాళ్లుగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవుల్ని అనుభవించిన వారు.. వ్యాపారాలు చేసుకొని.. డబ్బులు.. ఆస్తులు సంపాదించుకొని ఇప్పుడు పవర్ లేదని పార్టీ మారటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
స్వార్థం ఉన్న నేతలు ఉండే ఎంత? పోతే ఎంత? అంటూ రుసరుసలాడిన డిగ్గీ.. రేపొద్దున మరో పార్టీ అధికారంలోకి వస్తే.. టీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా ఆ పార్టీలో చేరతారా? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట నిర్మాణ వ్యయాన్ని మూడు.. నాలుగు రెట్లు పెంచేసి బహిరంగ దోపిడీకి బాటలు వేసినట్లుగా ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన నిపుణుల బృందంతో ప్రాజెక్టుల నిర్మాణాలపై నిఘా ఉంచుతామని.. అవకతవకలు.. అవినీతి మీద పోరాడనున్నట్లుగా డిగ్గీ రాజా పేర్కొన్నారు.
కేసీఆర్ మీద మండిపడిన డిగ్గీ.. పార్టీ నేతలకు సైతం కొన్ని సూచనలు చేశారు. పార్టీ నేతలంతా గాంధీ భవన్ విడిచిపెట్టి.. ప్రజల్లోకి వెళ్లాలని సూచించిన ఆయన.. ఒక ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు సర్జరీ అవసరమన్న మాటను ప్రస్తావించినప్పుడు నేరుగా సమాధానం చెప్పని ఆయన.. తెలంగాణ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంతో పోరాటం చేసి సోనియాను ఒప్పించారని.. వీరి కోరిక మేరకు సోనియా తెలంగాణను ఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారన్నారు. అదే ఉంటే.. ఈ రోజు ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా.