Begin typing your search above and press return to search.

సిమి ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ వత్తాసు!

By:  Tupaki Desk   |   8 April 2015 7:32 AM GMT
సిమి ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ వత్తాసు!
X
వరంగల్‌ జిల్లా పరిధిలో హతమైన సిమి ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తోంది. ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అంటూ.. కాంగ్రెస్‌ నేతలు కామెంట్లు మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ జాతీయ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఈ విషయంలో కామెంటరీ మొదలు పెట్టాడు. ఈ ఎన్‌కౌంటర్‌ వ్యవహారాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశాడు. ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అనే వ్యాఖ్యానించిన ఆయన.. గతంలో గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ల తో దీన్ని పోల్చాడు.

వాటిలాగే ఇది వికారుద్ధీన్‌ ది కూడా నకిలీ ఎన్‌కౌంటరేనేమో అని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పటి వరకూ వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో ఎమ్‌ఐఎమ్‌ నేతలు మాత్రమే గట్టిగా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌ తీరును అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించాడు.

శిక్షించే అధికారం పోలిసులకు లేదు... తప్పు చేసి ఉంటే.. న్యాయస్థానాలు శిక్ష విధించాలి అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పుకొచ్చాడు. వారు అమాయకులైన ముస్లిం యువకులు అని.. వారిని చంపడం దారుణమని ఒవైసీ సానుభూతి వచనాలు పలికాడు.

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా అలాంటి వాయిస్‌నే వినిపిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిగితే కానీ అసలు విషయాలు వెలుగులోకి రావని దిగ్విజయ్‌ సింగ్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

ఈ ఎన్‌కౌంటర్‌ విషయంలో విచారణ జరగాల్సిందేనని దిగ్విజయ్‌కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం విశేషం. మరి ఈ డిమాండ్‌ పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందో!