Begin typing your search above and press return to search.

సారు.. హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందంటే..?

By:  Tupaki Desk   |   20 Jan 2015 12:29 PM GMT
సారు.. హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందంటే..?
X
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. అధినాయకత్వానికి దగ్గర మనిసిగా పేరొందిన దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హనీమూన్‌ పిరియడ్‌ ముగిసిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పవర్‌లోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుందని.. అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టటంలో దూకుడుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తాజాగా డిగ్గీరాజా వ్యాఖ్యను చూస్తే.. కేసీఆర్‌ సర్కారుపై దాడి చేసేందుకే కాంగ్రెస్‌ పార్టీ సమాయుత్తమవుతుందన్న విషయం స్పష్టమవుతోంది. పార్టీని ఫిరాయించిన వారికి సినిమా చూపించేందుకు డిగ్గీ సమక్షంలోపార్టీ తీర్మానం చేసింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసలు చేయాలని.. అదే సమయంలో పార్టీలు ఫిరాయించిన వారిపై వేటు వేయాలనే విషయం మీదా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. తాజా డిగ్గీరాజా పర్యటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌నేతలు కాస్త దూకుడుగా వెళ్లే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.