Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు మాత్ర‌మే ఈ స‌త్తా ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   19 Oct 2016 1:10 PM GMT
కేసీఆర్‌ కు మాత్ర‌మే ఈ స‌త్తా ఉంద‌ట‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప్ర‌తిప‌క్షాలు కొత్త‌గా విశ్లేష‌ణ చేయ‌డం మొద‌లుపెడుతున్నాయి. త‌ను చేసుకున్న స‌ర్వేలో సూప‌ర్ సీఎంగా తేలింద‌నే విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించుకోవడాన్ని టీడీపీ ఎద్దేవా చేయ‌గా...తాజాగా కాంగ్రెస్ కొత్త కోణంలో కేసీఆర్ ప్ర‌త్యేక‌త‌ను వివ‌రించింది. నగరంలోని చార్మినార్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ రాజీవ్‌ సద్భావనా యాత్ర నిర్వ‌హించగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన‌ కార్యదర్శి-తెలుగు రాష్ర్టాల వ్య‌వ‌హారాల ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్ - టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి - షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎన్‌.రావుకు రాజీవ్‌ గాంధీ సద్భావన అవార్డులు ప్రదానం చేసిన అనంత‌రం దిగ్విజ‌య్ సింగ్ ప్ర‌సంగించారు.

కొత్త రాష్ర్టానికి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన కేసీఆర్ అభివృద్ధిపై దృష్టిపెట్ట‌కుండా వలసలను ప్రోత్సహిస్తున్నారని దిగ్విజ‌య్ సింగ్ మండిప‌డ్డారు. దేశం మొత్తం మీద ఇలా వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కడేనని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఉల్లంఘనలపై కోర్టులు స్పందించకపోవడం విచారకరమని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దేశంలో సెక్యులర్‌ వాదానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని, తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు సర్జికల్‌

స్ట్రైక్స్‌ ను తెరపైకి తెచ్చారని ఆయన చెప్పారు. వివిధ పార్టీల నుంచి నేతలు తమ వ్యాపారాల కోసమే టీఆర్‌ ఎస్‌ లోకి వెళుతున్నారని దిగ్విజ‌య్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 47 మంది పార్టీ మారడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌ లో ఎన్నికల నేపథ్యంలోనే సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయని ఉత్తమ్‌ కుమార్‌ అన్నారు. ఆరెస్సెస్‌ శిక్షణతోనే సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయనడం - దేశాన్ని మతపరంగా చీల్చాలనుకునే వాళ్లు అధికారంలో కొనసాగడం దారుణమని ఆయన మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/