Begin typing your search above and press return to search.

కొత్త సచివాలయం లెక్కే వేరు.. డిజిటల్ పాస్ లతో దడ పుట్టిస్తున్నారట

By:  Tupaki Desk   |   17 May 2023 7:14 AM GMT
కొత్త సచివాలయం లెక్కే వేరు.. డిజిటల్ పాస్ లతో దడ పుట్టిస్తున్నారట
X
పారదర్శకత పేరుతో పట్టు సాధించే ప్రయత్నాన్ని చేస్తున్న ప్రజా ప్రభుత్వ విధానాలు కొన్నింటిని చూస్తే.. అసలు లెక్కలు ఇట్టే అర్థమవుతాయి. తాజాగా అలాంటి తీరుకే తెర తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన కలలకు ప్రతిరూపంగా కొత్త సచివాలయాన్ని చెప్పాలి. వందల కోట్ల ప్రజాసొమ్ముతో నిర్మించిన ఈ రాజభవనం లాంటి పాలనా సముదాయంలో అనుసరిస్తున్న కొత్త విధానాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

ప్రభుత్వ కార్యాలయం అన్న తర్వాత అందరూ వచ్చి వెళుతుంటారు. అందరికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉండాలి. కానీ.. ఇప్పుడు భద్రత పేరుతో కొత్త తీరుకు తెర తీస్తున్నారు. కొత్త సచివాలయానికి చాలామంది వచ్చి వెళుతుంటారు. కానీ.. అలాంటిదేమీ లేకుండా సచివాలయంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి లెక్క పక్కాగా తేల్చే కార్యక్రమానికి తెర తీశారు. పటిష్ట భద్రత పేరుతో ఆంక్షల కన్ను మొత్తంగా అలుముకుంటుంది. గతంలో మాన్యువల్ పాస్ లు ఇచ్చేవారు. ఇక.. జర్నలిస్టులతోపాటు.. కొందరి విషయంలో ఎలాంటి ప్రత్యేక పాసులు లేకుండా వెళ్లి.. కలిసి వచ్చే వీలుండేది.

కానీ..ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రత్యేక పద్దతిని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం సచివాలయంలోకి ఎవరూ అడుగు పెట్టాలన్నా.. వారికి సంబంధించిన వివరాలు పక్కాగా నమోదు కావాలి. అంతేనా.. లోపలకు వెళ్లిన తర్వాత ఎవరినైతే కలవాలో వారిని మాత్రమే కలవాలి. అంతకు మించి కలిసేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ కలవాలంటే మళ్లీ పాసు తీసుకోవాలి. అంటే.. ఒకరిని కలవటానికి వెళ్లి పనిలో పనిగా నలుగురైదుగురిని కలిసే వీలు.. వెసులుబాటు ఉండదన్న మాట.

అంటే.. ఇరిగేషన్ శాఖకు వెళ్లిన వ్యక్తికి.. కేవలం ఇరిగేషన్ శాఖకు చెందిన వారినే కలిసే వీలు ఉంటుంది. ఉదాహరణకు ఇరిగేషన్ శాఖలో సుబ్బయ్యను కలవటానికి వెళితే.. సుబ్బయ్యను మాత్రమేకలవాలి. ఎల్లయ్యను.. పుల్లయ్యను కలిసేందుకుఅనుమతించారు.

వేరే శాఖలో మిత్రుడుఎవరైనా ఉండి.. నా దగ్గరకు వచ్చి పో అనే మాటకు ఛాన్సు లేదు. అంతేనా.. సచివాలయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు ఎవరిని కలిశారు? ఎంతసేపు కలిశారు? లాంటి సమాచారం మొత్తం రికార్డు అయ్యే వ్యవస్థను తీసుకొచ్చారు.

పాస్ ల ప్రక్రియను చూసేందుకు వీలుగా ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పారు. అంతేనా.. సచివాలయం చుట్టూ 300 వరకుసీసీ కెమేరాల్ని ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించటంతో ప్రతి అంగుళం నిఘా నీడలోకి వచ్చేస్తుంది. దీంతో.. సచివాలయంలోసామాన్యులకుప్రవేశం అస్సల్లేదు. మిగిలిన లెక్కల్ని పక్కన పెడదాం. ఎవరైనా ఒక వ్యక్తి సచివాలయంలోని తనకు తెలిసిన పాతిక మందికి పెళ్లి కార్డులు ఇవ్వాల్సి వస్తే.. పరిస్థితి ఏమిటంటారు?