Begin typing your search above and press return to search.
డిజిటల్ ఇండియా ఓ లైఫ్ స్టైల్ : ప్రధాని మోదీ !
By: Tupaki Desk | 20 Nov 2020 8:10 AM GMTకేంద్ర ప్రభుత్వం దేశం అభివృద్ధి లో భాగంగా గత ఐదేళ్ల క్రితం ప్రారంభించిన డిజిటల్ ఇండియా మిషన్ సర్కారు కార్యక్రమంగానే మిగిలిపోలేదని, ఈ రోజు డిజిటల్ ఇండియా లైఫ్ స్టైల్ గా పరిణమించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బెంగుళూరు టెక్ సమ్మిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ... డిజిటల్ ఇండియా మనదేశంలో మనిషి కేంద్రకంగా అభివృద్ధి చెందుతున్నది. దేశ పౌరుల జీవితాల్లో టెక్నాలజీ అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రతిఒక్కరూ టెక్ ఫలితాలు అనుభవిస్తున్నారు. డిజిటల్, టెక్ సొల్యూషన్స్ కు మార్కెట్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైంది. టెక్నాలజీ ఫస్ట్ రూపంలోనే ప్రభుత్వ మాడల్ ఉంది అని చెప్పారు.
25 ఏళ్ల కిందట భారత్ లో ఇంటర్నెట్ ప్రవేశించిందని, ఇటీవలే దేశంలోని ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 750 మిలియన్లు దాటిందని, అయితే ఇందులో సగం కనెక్షన్లు గత నాలుగేళ్లలో నమోదైనవేనని మోదీ వెల్లడించారు. ఈ వార్తా ప్రపంచంలో సమాచారమే ముడిసరుకు అని, ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. మన యువత శక్తిసామర్థ్యాలు, శాస్త్రసాంకేతిక అవకాశాలు అపారం అన్నమోదీ.. ఈ దిశగా పాటవ ప్రదర్శనకు, పరపతి పెంపుకు ఇదే తగిన సమయం అని అన్నారు. కరోనా మహమ్మారి కాలంలో సాంకేతికత ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. లాక్ డౌన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు పేద ప్రజలందరికీ టెక్నాలజీ సహాయంతోనే సకాలంలో సహకారం అందించగలిగామని తెలిపారు. సాంకేతికత ద్వారా జనజీవన సౌందర్యం మరింత విస్తృతమైందని.. కోట్లాది మంది రైతులు ఒక్క క్లిక్ తో ద్రవ్యపరమైన మద్దతు పొందగలుగుతున్నారని అన్నారు. మన ఐటీ రంగం దేశాన్ని గర్వించేలా చేస్తుందని తనకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు. టెక్, ఆవిష్కరణల రంగాన్ని మరింత స్వేచ్ఛాయుతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.